పాతబజార్‌ అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

పాతబజార్‌ అభివృద్ధి

Apr 11 2026 9:04 AM | Updated on Apr 11 2026 9:04 AM

పాతబజార్‌ అభివృద్ధి సమస్యలు తీరనున్నాయి

పాతబజార్‌ అనగానే అందరికి చిన్నచూపే. అయి తే కొత్తబజార్‌తో సమానంగా అభివృద్ధి చేయా లనే లక్ష్యంగా ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి నగర అభివృద్ధి నిధులు రూ.6.50కోట్లు మా పాతబజార్‌కు కేటాయించారు. ఏవో కారణాలతో టెండరు ప్రక్రియ ఆగిపోయింది. తిరిగి ప్రారంభిస్తున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఆ నిధులతో మాప్రాంతం సుందరంగా మారుతుందని ఆశిస్తున్నాం. మా 6వ వార్డులోనే రూ.కోటి 50లక్షలతో సీసీరోడ్లు, డ్రెయినేజీలు నిర్మించనున్నాం.

– సుంకసారి రమేష్‌,

6వ వార్డు కౌన్సిలర్‌, పాతబజార్‌.

నగర అభివృద్ధి నిధులు రూ.2కోట్ల ద్వారా మా 7వ వార్డులో సమస్యలు చాలామటుకు తీరనున్నాయి. పాతబజార్‌ నుంచి బూరెడ్డిపల్లికి వచ్చే ప్రధాన రోడ్డుపై మురికినీరు పారుతోంది. అలారాకుండా ఉండేందుకు కాల్వ నిర్మిస్తున్నాం. అలాగే పాతబజార్‌ శివాల యం వద్ద కాల్వ, బూరెడ్డిపల్లి నుంచి జాతీయ రహదారిపైకి నీరు రాకుండా మరో కాల్వ ఇలా మొత్తం రూ.2కోట్ల నిధులతో పనులు ప్రతిపాదించాం. వీటితోపాటు ముడా నిధులు రూ.40లక్షలతో మరిన్ని అభివృద్ధి పనులు చేస్తున్నాం.

– గుండు ఉమాదేవి,

7వార్డు కౌన్సిలర్‌, బూరెడ్డిపల్లి.

Advertisement
 
Advertisement
Advertisement