జడ్చర్ల పురపాలికకు రూ.15కోట్ల నగర అభివృద్ధి నిధులు
● మొదటి విడుతగా రూ.12కోట్లు, తాజాగా రూ.3కోట్లు విడుదల
● పాతబజార్‌కు సింహభాగం నిధుల కేటాయింపు
●
జడ్చర్ల టౌన్: మున్సిపాలిటీలో రాష్ట్ర ప్రభు త్వం కేటాయించే న గర అభివృద్ధి నిధు ల వినియోగానికి ఉన్న ఆటంకాలు తొలగిపోయాయి. నగర అభివృద్ధి కింద మున్సిపాలిటీకి కొన్నాళ్ల క్రితం రూ.15కోట్లు కేటాయించారు. ఇందులో మొదటి విడతగా రూ.1 2కోట్ల పనులకు టెండరు ప్రక్రియ ప్రారంభం కా గా.. సాంకేతిక కారణాలతో వాటిని నిలిపి వేశారు. తాజాగా మరో రూ.3కోట్లు విడుదలయ్యాయి. మొత్తానికి రూ.15 కోట్ల పనులకున్న ఆటంకాలు తొలగిపోవడంతో టెండరు ప్రక్రియ ప్రారంభిస్తున్నా రు. మున్సిపాలిటీ అభివృద్ధికి నిధు లు వరదలా వస్తు న్నాయి. తా జాగా నగర అభివృద్ధి నిధులు రూ.15కోట్లు కేటాయించబడ్డాయి. వాటిలో రూ.12 కోట్లు విడుదల కాగా.. ఆ నిధులతో చేపట్టాల్సిన పనుల ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. సాంకేతిక కారణాలతో ఆ నిధుల వినియోగానికి వీలు లేకుండాపోయింది. ఇటీవల ఆ సమస్యలు వీడటంతో టెండరు ప్రక్రియ ప్రారంభించనున్నారు.


