భూసారం కాపాడుదాం.. దిగుబడి పెంచుకుందాం | - | Sakshi
Sakshi News home page

భూసారం కాపాడుదాం.. దిగుబడి పెంచుకుందాం

Apr 11 2026 9:04 AM | Updated on Apr 11 2026 9:04 AM

మదనాపురం: మట్టి బాగుంటేనే.. మనిషి బాగుంటాడు. పొలంలో మట్టి కేవలం ధూళి కాదు, అది కో ట్లాది జీవులకు నిలయం. ఆ నేలతల్లిని మనం ఆరోగ్యంగా చూసుకుంటేనే, అది మనకు బంగారు పంటలను అందిస్తుందని మదనాపురం కేవీకే శాస్త్రవేత్త డాక్టర్‌ భవాని రైతులకు సూచిస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న భూమి సుపోషణ, సంరక్షణ జ న అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా ఆమె నేల ఆరో గ్య పరిరక్షణపై రైతులకు అవగాహన కల్పించారు.

భూసారం ఎందుకు క్షీణిస్తోంది?

అడ్డగోలుగా రసాయన ఎరువులు వాడటం, పంట మార్పిడి లేకపోవడం వల్ల భూమి తన సారాన్ని కో ల్పోతుందని, మట్టిలో జీవం తగ్గితే దాని ప్రభావం దిగుబడి పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

నేల ఆరోగ్యాన్ని కాపాడే త్రాలు

● జనుము, పిల్లిపెసర వంటి పచ్చి ఎరువుల పంటలను పూత దశలో భూమిలో కలియదున్నాలి. గొర్రెల, మేకల మందలను పొలంలో కట్టడం వల్ల సహజంగా పోషకాలు అందుతాయి.

● వర్మీ కంపోస్ట్‌ (వానపాముల ఎరువు), పశువుల ఎరువును వాడటం వల్ల మట్టిలో తేమ నిల్వ ఉండే శక్తి పెరుగుతుంది.

● ఒకే రకం పంట వేయకుండా క్రమంగా పంట మార్పిడి చేయాలి. చిక్కు డు జాతి పంటలను అంతర పంటగా వేస్తే గాలి లోని నత్రజని మట్టికి అందుతుంది.

● పంట కోత తర్వాత మిగిలిన చెత్తను తగలబెట్టకుండా, భూమిలోనే కుళ్లేలా చేయాలి.

● నేలపైన చెత్తాచెదారం పర్చడం వల్ల నీరు ఆవిరి కాకుండా ఉండటమే కాకుండా, మట్టి కోతను అరికట్టవచ్చు.

● పంటకు ఎరువులు వాడే ముందు మట్టి పరీక్ష చేయించి, అందులో లోపించిన సూక్ష్మ పోషకాలను మాత్రమే అందించాలి. లాభసాటి వ్యవసాయం వైపు అడుగులు వేయాలి.

● ఈ పద్ధతులు పాటించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ, మట్టిలో సూక్ష్మజీవుల క్రియాశీలత పెరిగితే, భూమి గుల్లబారి వేర్లు లోతుకు వెళ్తాయన్నారు. దీనివల్ల పంటకు బలం చేకూరి, ఎరువుల ఖర్చు తగ్గి, నాణ్యమైన దిగుబడి వస్తుందని శాస్త్రవేత్త భవాని వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement