నిషేధిత కల్లు స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

నిషేధిత కల్లు స్వాధీనం

Apr 11 2026 9:04 AM | Updated on Apr 11 2026 9:04 AM

గద్వాల క్రైం: లైసెన్స్‌ లేకుండా గుట్టుగా కల్లు విక్రయిస్తున్న వ్యక్తిని గద్వాల ఎకై ్సజ్‌ సీఐ గణపతిరెడ్డి బృదం అదుపులోకి తీసుకున్నారు. ఆయన కథనం ప్రకారం.. గద్వాల పట్టణంలోని జమ్మిచేడుకు చెందిన లచ్చగౌడ్‌ కొన్నిరోజులుగా కల్లును గుట్టుగా విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు శుక్రవారం దాడులు నిర్వహించారు. దీంతో సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని 20 లీటర్ల కల్లును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అయితే కల్లు తయారీకి మత్తు పదార్థాలు కలిపి ఈత కల్లుగా నమ్మించి అమ్ముతున్నట్లు తెలుస్తుంది. నిందితుడు విక్రయిస్తున్న కల్లు శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించి ల్యాబ్‌ రిపోర్టు ఆధారంగా తగుపరి చర్యలు ఉంటాయన్నారు. ఎకై ్సజ్‌ శాఖ అనుమతి లేకుండా కల్లు విక్రయిస్తున్న లచ్చగౌడ్‌పై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.

తప్పిన ప్రమాదం

గద్వాల క్రైం: ప్రమాదవశాత్తు నీలగిరి చెట్లు నేలకొరిగిన ఘటన శుక్రవారం పట్టణంలో చోటుచేసుకుంది. గద్వాల పంచాయతీరాజ్‌ ఉపకార్యనిర్వాహక అభియంత కార్యాలయంలో రెండు నీలగిరి చెట్లున్నాయి. శుక్రవారం ఉదయం ప్రమాదవశాత్తు రెండు చెట్లు నేలకొరిగాయి. ఈ ప్రమాదంలో ఓ బైక్‌ ధ్వంసం కాగా.. నేలకొరిగినప్పుడు ప్రజలు ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం చోటు చేసుకోలేదు. కార్యాలయ సిబ్బంది ఒకసారిగా భయాదోళనకు గురాయ్యరు.

Advertisement
 
Advertisement
Advertisement