హిందూధర్మ పరిక్షణ అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

హిందూధర్మ పరిక్షణ అందరి బాధ్యత

Apr 10 2026 10:57 AM | Updated on Apr 10 2026 10:57 AM

విశ్వామిత్ర తపోభూమి పీఠాధిపతి

భక్తసురేష్‌ స్వామి

జడ్చర్ల టౌన్‌: హిందూధర్మ పరిరక్షణ ప్రతి హిందూ బాధ్యతగా స్వీకరించాలని శంషాబాద్‌ విశ్వామిత్ర తపోభూమి పీఠాధిపతి భక్త సురేష్‌స్వామిజి సందేశమిచ్చారు. పట్టణంలోని గౌడ ఫంక్షన్‌ హాల్‌లో హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన హిందూ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భారతమాత చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి వెలిగించి సమ్మేళనాన్ని ప్రారంభించారు. అనంతర ఆయన మాట్లాడుతూ.. హిందువులంతా ఐక్యంగా ఉండాలని, హిందూసంస్కృతి ఎంతో గొప్పదన్నారు. పాశ్ఛాత్య సంస్కృతిలో కొట్టుమిట్టాడుతున్న వారంతా తేరుకోవాలని, మన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవాలన్నారు. ప్రతి తల్లిదండ్రి పిల్లలకు దేశ గొప్పతనాన్ని చాటి చెప్పాలని, దేశభక్తిని పెంపొందించేలా కృషి చేయాలన్నారు. మరోవక్త సంస్కార భారతి ప్రాంత సహకార్యదర్శి చక్రవర్తి వేణుగోపాల్‌ మాట్లాడుతూ దేశాన్ని విశ్వగురువుగా నిర్మాణం చేయాలనే లక్ష్యంతో ఆర్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 80వేలు, రాష్ట్రంలో 3వేలు, జడ్చర్ల నగరంలో 7సమ్మేళనాలు నిర్వహించటం జరుగుతుందన్నారు. సమ్మేళనాల ద్వారా హిందువులను జాగృతపర్చటం, ధర్మ పరిరక్షణ జరుగుతుందన్నారు. సమ్మేళనంలో అక్షరహైస్కూల్‌ విద్యార్థులు చేసిన రామాయణం నృత్యప్రదర్శన ఆకట్టుకుంది. సమ్మే ళన నిర్వాహకులు చంద్రయ్య, జగ్‌పాల్‌రెడ్డి, తోటారెడ్డి, కరుణాకర్‌, అనంతప్ప, వార్డుకౌన్సిలర్లు ఉమా శంకర్‌గౌడ్‌, ప్రశాంత్‌రెడ్డి, నందకిశోర్‌గౌడ్‌తోపాటు పట్టణవాసులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement