బారులు | - | Sakshi
Sakshi News home page

బారులు

Apr 10 2026 10:57 AM | Updated on Apr 10 2026 10:57 AM

సిలిండర్ల కోసం

వంట గ్యాస్‌ సిలిండర్ల కొరతతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. గురువారం ధన్వాడ

మండల కేంద్రంలోని ఇండియన్‌ గ్యాస్‌ ఏజెన్సీ ముందు గ్యాస్‌ సిలిండర్‌ కోసం వినియోగదారులు బారులుదీరారు. సిలిండర్‌ కోసం బుక్‌ చేసినా డెలివరీ బాయ్‌ ఇంటి వద్దకు డెలివరీ చేయడానికి రోజులు పడుతుండడంతో ప్రజలే గ్యాస్‌ ఏజెన్సీ ముందు క్యూ కట్టారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన గ్యాస్‌ వినియోగదారులు గంటల తరబడి క్యూలైన్‌లో నిలబడి సిలిండర్లను తీసుకెళ్లారు.

– ధన్వాడ

Advertisement
 
Advertisement
Advertisement