13 నుంచి 18 వరకు అరైవ్‌ అలైవ్‌ కార్యక్రమం | - | Sakshi
Sakshi News home page

13 నుంచి 18 వరకు అరైవ్‌ అలైవ్‌ కార్యక్రమం

Apr 10 2026 10:51 AM | Updated on Apr 10 2026 10:51 AM

అధికారులకు దిశానిర్దేశం చేసిన

కలెక్టర్‌, ఎస్పీ

మహబూబ్‌నగర్‌ క్రైం/జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అరైవ్‌ అలైవ్‌ కార్యక్రమం ఈనెల 13నుంచి 18వరకు విస్తృతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్టారావు అన్నారు. గురువారం సచివాలయం నుండి డీజీపీ శిశధర్‌రెడ్డితో కలిసి కలెక్టర్లు, ఎస్పీలతో వేర్వేరుగా వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రోడ్డు భద్రతపై అవగహన కార్యక్రమాలు, ట్రాఫిక్‌ నియమాల పాటింపు, హెల్మెట్‌, సీట్‌బెల్ట్‌ వినియోగంపై చైతన్యం తీసుకురావాలని సూచించారు. అనంతరం కలెక్టర్‌ ఖుష్బూ గుప్తా సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి అరైవ్‌ అలైవ్‌ కార్యక్రమం నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అలాగే జిల్లా పోలీస్‌ అధికారులతో ఎస్పీ డి.జానకి సమావేశం ఏర్పాటు కార్యాచరణపై సమీక్షించారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అరైవ్‌ ఆలైవ్‌ కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల తగ్గించే దిశగా ప్రతి అధికారి కృషి చేయాలని సూచించారు. ఆయా సమావేశాల్లో కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మధుసూదన్‌ నాయక్‌, హరిప్రియ, జెడ్పీ సీఈఓ వెంకట్‌రెడ్డి, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కృష్ణ, డీఈఓ ప్రవీణ్‌ కుమార్‌, డీటీఓ రఘు, అదనపు ఎస్పీ ఎన్‌బీ రత్నం, డీఎస్పీ లు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, బాలాజీ, డీసీఆర్‌బీ సీఐ నర్సింహులు, అప్పయ్య, గాంధీనాయక్‌ పాల్గొన్నారు. కాగా.. ఈ నెల 16వ తేదీ జడ్చర్లలోని చంద్రగార్డెన్స్‌లో జరిగే అరైవ్‌–అలైవ్‌ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement