పెండింగ్‌ ఫైళ్లను పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ ఫైళ్లను పరిష్కరించాలి

Apr 10 2026 10:51 AM | Updated on Apr 10 2026 10:51 AM

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): వివిధ శాఖల్లో పేరుకుపోయిన పెండింగ్‌ ఫైళ్లను అధికారులు వెంటనే పరిష్కరించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ హరిప్రియ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన వీసీలో మాట్లాడారు. 60రోజులకుపైగా పెండింగ్‌లో ఉన్న భూభారతి దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని, తిరస్కరించబడ్డ అభ్యర్థనలకు కారణాలను నివేదికలో పేర్కొనాలని సూచించారు. సాదా బైనామా, ఇతర భూలావాదేవీల నివేదికలను సిద్ధం చేసేముందు తప్పనిసరిగా ఇరు పార్టీల వారికి నోటీసులు జారీచేయాలన్నారు. రాజాపూర్‌, నవాబుపేట, మూసాపేట, మహమ్మదాబాద్‌, మహబూబ్‌నగర్‌ అర్బన్‌, జడ్చర్ల, గండీడ్‌, అడ్డాకుల, బాలానగర్‌, కౌకుంట్ల, కోయిలకొండ తహసీల్దార్ల పరిధిలో అధిక పెండింగ్‌ కేసులు ఉన్నాయని, వాటిని గడువులోగా పూర్తిచేయాలని ఆదేశించారు. జిల్లాలో ఇసుక సరఫరాకు ఆఫ్‌లైన్‌కు అనుమతులు ఇవ్వకూడదని సూచించారు. నిరంతరం తనిఖీలు నిర్వహించి ప్రతివారం నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. జిల్లాలో సాగుతున్న ఎలక్టోరల్‌ మ్యాపింగ్‌ వేగవంతం చేయాలన్నారు. ఏప్రిల్‌ 10నుంచి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అనంతరం నీటిపారుదల, అటవీ, రెవెన్యూ శాఖల అధికారులతో తడి భూముల గుర్తింపుపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. చెరువులు, నీటివనరులపై సంయుక్త సర్వేలు నిర్వహించి, ఫుల్‌ట్యాంక్‌ లెవల్‌ పరిమితులను నిర్ధారించి, జోనల్‌ ప్రభావిత ప్రాంతాలను గుర్తించాలని ఆదేశించారు. సమావేశాల్లో డీఆర్‌ఓ రారెడ్డి, ఆర్‌డీఓ నవీన్‌, డీఎం రవినాయక్‌, సర్వే భూ రికార్డుల ఏడీ అశోక్‌, నీటిపారుదల శాఖ అధికారి వెంకటయ్య, పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement