ఆర్టిజన్‌ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ఆర్టిజన్‌ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి

Apr 10 2026 10:51 AM | Updated on Apr 10 2026 10:51 AM

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): విద్యుత్‌ ఖలో పనిచేస్తున్న ఆర్టిజన్‌ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని విద్యుత్‌ ఉద్యోగుల సంఘం 1104 జిల్లా కార్యదర్శి పాండు డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ ఎంప్లాయిస్‌ ఆర్టిజన్ల జేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్‌ డివిజన్‌ కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్న ధర్నా గురువారం రెండోరోజు కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిమాండ్ల సాధన కోసం ఆర్టిజన్ల పోరాటానికి తమ యూనియన్‌ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. వారి డిమాండ్లను పరిష్కరించే వరకు అండగా ఉండడంతో పాటు యాజమాన్యంపై ఒత్తిడి తెస్తామన్నారు. ఆర్టిజన్‌ జేఏసీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు జాకీర్‌ మాట్లాడుతూ ఆర్టిజన్లకు ఏపీఎస్‌ఈబీ సర్వీస్‌ రూల్స్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.విద్యుత్‌ సంస్థల్లో పనిచేస్తున్న పీస్‌రేట్‌ కార్మికులకు జీఓ 11 ప్రకారం కనీస వేతనాలు చెల్లించాలన్నారు. వివిధ సంఘాల నాయకులు ఉదయ్‌కుమార్‌, బాబ్య, ప్రమోద్‌కుమార్‌, బాలరామ్‌ పెండయ్య, తిరులమలేష్‌, సైదు, మోయిజ్‌, శ్రీనివాసులు, సర్వేశ్వర్‌రెడ్డి శేఖర్‌, రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement