అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

Apr 10 2026 10:51 AM | Updated on Apr 10 2026 10:51 AM

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): జిల్లాలో అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో వివిద శాఖల అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రగతిలో ఉన్న అభివృద్ధి పనులు వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణంలో పారిశుద్ధ్య కార్యక్రమాలపై అశ్రద్ధ వహించవద్దని సూచించారు. నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ బిల్లులు పెండింగ్‌లో పెట్టవద్దన్నారు. పురోగతిలో ఉన్న ఇళ్లను వేగంగా పూర్తి చేసేందుకు చొరవ తీసుకోవాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement