గురులోకా మసంద్ బావాజీ, కాళికాదేవిని మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు నవీన్‌రెడ్డితో పాటు మాజీ ఎమెల్యేలు పట్నం నరేందర్‌రెడ్డి, రాంమోహన్‌రెడ్డి, అంజయ్యయాదవ్ దర్శించుకున్నారు. అంతకు ముందు ఆలయ కమిటీ ఆద్వర్యంలో శాలువా పూలబొకేతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, గోపాల్, కౌన్సిలర్లు దినేశ్‌కుమార్, గోపాల్, సంగీత శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.


