చిత్తుబొత్తు ఆట స్థావరంపై పోలీసుల దాడి | - | Sakshi
Sakshi News home page

చిత్తుబొత్తు ఆట స్థావరంపై పోలీసుల దాడి

Apr 4 2026 8:31 AM | Updated on Apr 4 2026 8:31 AM

ఎర్రవల్లి: మండలపరిధిలో చిత్తుబొత్తు ఆట స్థావరంపై దాడి చేసి 18 మందిని అరెస్ట్‌ చేసినట్లు ఇటిక్యాల ఎస్‌ఐ రవి రాథోడ్‌ శుక్రవారం తెలిపారు. బీచుపల్లి గ్రామ శివారులో బొమ్మ బొరుసు ఆడుతున్నట్లు సమాచారం రావడంతో పోలీస్‌ సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. దాడిలో వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 18 మంది నిందితులను అదుపులోకి తీసుకొని వారి నుంచి 8బైక్‌లు, 20చరవాణిలు, రూ.93,200 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ సందర్భంగా సీఐ ప్రదీప్‌కుమార్‌ మాట్లాడుతూ చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

పేకాటరాయుళ్ల అరెస్టు

వనపర్తి రూరల్‌: పేకాట ఆడుతున్న 8 మంది వ్యక్తులను పోలీసులు పట్టుకున్న ఘటన శుక్రవారం పెద్దగూడెం శివారులో చోటు చేసుకుంది. వనపర్తి రూరల్‌ ఎస్‌ఐ హృశికేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దగూడెం శివారులోని డబుల్‌బెడ్‌రూం 202 నెం ఇంట్లో 8 మంది వ్యక్తులు సాయంత్రం అందర్‌బార్‌ పేకాట ఆడుతున్నారని పోలీసులు ఘటనా స్థలానికి 8 మంది వ్యక్తులను పట్టుకొగా వారి నుంచి రూ 36,030 నగదు, 5 బైకులు, 8స్మార్ట్‌ ఫోన్‌లను, 104 పేక ముక్కలను స్వాధీనం చేసుకుని వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 8మంది వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

8బైక్‌లు,

రూ.93,200 నగదు స్వాధీనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement