కంపెనీల నుంచి మా పొలాల్లోకి కాలుష్యపు నీళ్లు వదులుతున్నారు. ఉన్న రెండు కుంటలూ కలుషిత నీటితో నిండి.. ఆ నీరు పంట పొలాల్లోకి చేరుతోంది. ప్రతి ఏటా తప్పనిసరిగా మారింది. ఇప్పటికే ఉన్న బోర్లన్నీ కలుషితమయ్యాయి. ఒక్క చుక్క నీరు తాగలేకపోతున్నాం. పంటలు అసలే పండడం లేదు. నష్టపరిహారం ఇప్పించాలి. – కిష్టారం మల్లేష్ గౌడ్, రైతు, రాయపల్లి
చేసేది లేక వ్యవసాయం వదులుకున్నా..
మా నాయన వాళ్ల కాలంలో మేం చిన్నగా ఉన్నప్పుడు మా బావుల నీళ్లనే తాగేటోళ్లం. ఇప్పుడు బాయికాడికి వస్తే ఇంటి నుంచి ఫిల్టర్ నీటిని తెచ్చుకుని తాగాల్సిన పరిస్థితి వచ్చింది. పరిశ్రమల నుంచి వచ్చిన కలుషిత నీటిని తాగి పశువులు సచ్చిపోతున్నాయి. మా బాధలు ఎవ్వరికీ పట్టడం లేదు. చేసేది లేక వ్యవసాయం వదులుకున్నా. – పాలెం శ్రీనివాస్, రైతు
మా చెరువులోకి కాల్వ తీస్తే ఊరుకోం..
మా గ్రామ శివారులో ఉన్న పరిశ్రమల కారణంగా పల్లె చెరువు కాలుష్యమైపోయింది. చెరువులో చేపలు వదిలితే చనిపోతున్నాయి. ఉన్న కాలుష్యంతోనే ఇబ్బందులు పడుతుంటే పోలేపల్లి దిక్కు ఉన్న కంపెనీల నుంచి కాల్వ తీసి మా గ్రామ చెరువులోకి కలిపేందుకు చూస్తున్నారంట. దీన్ని ఎట్టిపరిస్థితిలోనూ అంగీకరించేది లేదు. అవసరమైతే ఊరోళ్లందరం కలిసి సెజ్ గేట్ ముందు ఆందోళన చేస్తాం. – దేవోళ్ల శేఖర్ గౌడ్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు, ముదిరెడ్డిపల్లి
●


