● మాజీ మంత్రి హరీశ్‌రావు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిలదీద్దామని బీఆర్‌ఎస్ శాసనపక్ష ఉపనాయకుడు, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్‌లోని గ్రీన్‌బెల్ట్‌లోని దొడ్డి కొమురయ్య విగ్రహానికి మాజీమంత్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మిరెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డితో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దొడ్డి కొమురయ్య వర్ధంతి,జయంతి కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించాలని శ్రీనివాస్‌గౌడ్, శ్రీనివాస్‌యాదవ్‌లు కోరిన వెంటనే కేసీఆర్ అధికారికంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. బీసీలను, కుర్వ, గొల్ల కురుమలకు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. వేల కోట్ల బడ్జెట్ ఇస్తామని కేవలం ఏడు కోట్ల లోపు నిధులు ఖర్చు చేసినట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయని తెలిపారు. శాసనసభలో రేవంత్ ప్రభుత్వాన్ని ఈ విషయంపై నిలదీసినట్లు పేర్కొన్నారు. యాదవులకు గొర్లు ఇస్తామని నగదు బదిలీ పథకం అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ మహబూబ్‌నగర్ పచ్చబడాలని ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు హరీశ్‌రావు అహర్నిశలు కృషి చేసినట్లు గుర్తు చేశారు. రోడ్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడంతో పాటు సాగు నీరు అందించేందుకు పూర్తి ప్రయత్నాలు చేసినట్లు తెలిపారు. పాలమూరు ప్రాజెక్ట్ 90శాతం పూర్తయిందని మిగిలిన పనులు వేగంగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయంగా బీసీలకు సమాన అవకాశాలు కల్పించాలని కోరారు. కార్పొరేషన్‌లు ఏర్పాటు చేసి నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, నాయకులు వెంకన్న, శివరాజు, ఇంతియాజ్, కిషోర్, కుర్వసత్యం, నరేష్, శరత్, మున్నూర్‌రాజు, గాయత్రి తదితరులు పాల్గొన్నారు.
దొడ్డి కొమురయ్య విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న
మాజీ మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి తదితరులు


