● గ్రామీణ యువతకు ఆదాయ వనరులు కల్పించడమే లక్ష్యం
● రాష్ట్ర క్రీడలు, మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి
రాజాపూర్: గ్రామీణ ప్రాంత యువతకు ఆదాయ వనరులు సమకూర్చి వారికి స్వయం ఉపాధి రంగాల్లో నిలదొక్కుకునేలా చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర క్రీడలు, మత్య్సశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం బాలానగర్ మండలంలోని మొదంపల్లిలోనూతనంగా ఏర్పాటు చేసిన బయో ప్లోక్ ఫిష్ ట్యాంక్స్‌ను జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆధునిక వ్యవసాయ, అనుబంధ రంగాల అభివృద్ధికి కొత్త సాంకేతికతలను తీసుకొచ్చి గ్రామీణ యువతకు ప్రాత్సహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి మాట్లాడుతూ జడ్చర్ల నియోజకవర్గ అ భివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లుపేర్కొన్నారు. కొత్తగా మంజూరైన విద్యుత్ సబ్‌స్టేషన్‌ల పనులు ముమ్మరంగా సాగుతున్నాయని, అవి పూర్తయితే లోఓల్టేజి సమస్య ఉండదన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్, నవోదయ పాఠశాలను బాలానగర్ మండలం పెద్దాయపల్లిలో శంకుస్థాపనలు చేసినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో విద్య, వైద్యంతో పాటు వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కార్యక్రమంలో జడ్చర్ల మున్సిపల్ చైర్‌పర్సన్ పుష్పలత, బాలానగర్ సర్పంచ్ వెంకటేశ్వర్‌రెడ్డి, నాయకులు మోహన్‌నాయక్, బాసునాయక్, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


