ఆరోగ్య ప్రదాయిని రాగి అంబలి
● చిరు ధాన్యాలతోనే సంపూర్ణ ఆరోగ్యం
● కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త
డా.అనిత
మదనాపురం: నేటి ఆధునిక జీవనశైలిలో మారిన ఆహారపు అలవాట్ల కారణంగా మనిషి ఆయుప్రమాణం రోజురోజుకూ తగ్గిపోతుంది. పాశ్చాత్య ఆహార సంస్కృతికి అలవాటు పడి, పాలిష్ బియ్యం, మైదాలను ఆహారంలో ఎక్కువగా చేర్చడంతో చిన్న వయసులోనే మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నామని మదనాపురం కషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా.అనిత హెచ్చరించారు. సిరిధాన్యాలు మానవాళికి ప్రకృతి ప్రసాదించిన వరమని, వాటి ప్రాముఖ్యతను తెలిపారు. చిరుధాన్యాలు షుగర్, బీపీ ఉన్నవారికి అ త్యుత్తమ ఆహారంగా నిలుస్తాయి. వాటిలో గ్లైసిమిక్ ఇండెక్ చాలా తక్కువగా ఉండడంతో ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను ఒక్కసారిగా పెంచకుండా అదుపులో ఉంచుతాయి. డయాబెటిస్ గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారికి అమృత ఆహారం.
కణజాల రక్షణకు..
మన శరీరంలోని కణజాలం దెబ్బతినకుండా కాపాడే ఆంటీ ఆక్సిడెంట్లు చిరుధాన్యాల్లో పుష్కలంగా ఉన్నా యి. ఫలితంగా ఇవి ఒబేసిటి (అతి బరువు), గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. చిరుధాన్యాలు తీసుకోవడం వల్ల శరీరం చురుగ్గా, నిరంతరం శక్తివంతంగా ఉంటుంది. వీటిలోని పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరిచి, శరీరంలోని వ్యర్థ పదా ర్థాలను సులభంగా తొలగించడానికి సహాయపడుతుంది. క్యాల్షియం మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా ఎదుగుతున్న పిల్లలకు, వృద్ధులకు ఎముకల బలానికి, కీళ్ల నొప్పులను తగ్గించడానికి చిరుధాన్యాలు ఎంతగానో తోడ్పడతాయి. చిరుధాన్యాలు నాడీ వ్యవస్థను బలపర్చడం ద్వారా మేథోశక్తి మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మన దైనందిన ఆహారంలో వరి, గోధుమల స్థానంలో కొంతవరకై నా రాగులు, జొన్నలు, సజ్జలు, కొరల్రు వంటి సిరిధాన్యాలను చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని డా.అనిత సూచించారు.
రాగి అంబలి
రాగి ధాన్యాలతో చేసిన బిస్కెట్
వేసవి కాలంలో ముఖ్యంగా రాగులను ఆహారంలో భాగంగా చేసుకోవడం ఎంతో అవసరమని, రాగులతో చేసిన అంబలి తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్ (నీటి శాతం తగ్గిపోవడం) కాకుండా కాపాడుకోవచ్చని, ఇది చలవ చేయడమే కాకుండా శరీరానికి కావాల్సిన తక్షణ శక్తిని అందిస్తుందని డా.అనిత వివరించారు.


