నేడు పెద్ద రథోత్సవం
సిర్సనగండ్లలో మార్మోగిన శ్రీరామ నామస్మరణ
చారకొండ: సీర్సనగండ్ల సీతారామచంద్రస్వామి బ్రహోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం తెల్లవారు జామున పూల రథోత్సవం (చిన్నతేరు) కనులపండువగా సాగింది .ఆలయ చైర్మన్ ఢేరం రామశర్మ, ఈఓ అంజనేయులు మేనేజర్ నిరంజన్ అర్చకులు, ప్రజా ప్రతినిథులు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయ ప్రాంగణంలోని గుట్టపై దత్తాత్రేయగుడి, ముక్కిడి పోచమ్మ, మైసమ్మ దేవాలయాలను దర్శించుకొని నైవేద్యం సమర్పించారు. మేళతాళాలు, భజనలు, భక్తుల శ్రీరామనామ స్మరణతో రథం ముందుగు సాగింది. రఽథోత్సవానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం ఆలయంలో స్వామివారిని దర్శనం అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు లక్ష్మణ్‌శర్మ, మురళీధర్‌శర్మ, వేణుశర్మ, ఆనంద్‌శర్మ, అనంతశర్మ, గోపీశర్మ, భాస్కర్‌శర్మ పాల్గొన్నారు.
సోమవారం అర్ధరాత్రి తర్వత పెద్ద రథోత్సవం ప్రారంభమవుతుంది భక్తులు అధిక సంఖ్యలో హజరై స్వామివారిని దర్శించుకొని, ఉత్సవాన్ని విజయవంతం చేయాలని ఆలయ చైర్మన్, ఈఓ కోరారు.


