● ముగిసిన శ్రీరామ నవమి ఉత్సవాలు
ఉప్పునుంతల: మండల కేంద్రమైన ఉప్పునుంతలలో స్థానిక కేదారేశ్వర చెన్నకేశవ స్వామి ఆలయంలో శ్రీరామ నవమిని పురస్కరించుకొని నాలుగు రోజులపాటు నిర్వహించిన బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం అంతరాష్ట్ర ఎద్దుల బండలాగుడు పోటీలు అట్టహాసంగా కొనసాగాయి. సీనియర్ విభాగంలో ఆయా ప్రాంతాల నుంచి ఏడు జతల ఎద్దులు పాల్గొన్నాయి. వాటిలో ప్రాధాన్యత క్రమంలో ఐదు జతలను విజేతలుగా ఎంపికచేసి నగదు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి రూ. 80 వేలు నగదు (దాత కట్టా సరిత అనంతరెడ్డి)ను నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం కోప్పోల్‌కు చెందిన హనుమాన్ ఎద్దులు గెలుచుకున్నాయి. రెండో బహుమతి రూ.60 వేలు (దాత మదనాగుల మహేందర్), మూడో బహుమతి రూ.40 వేలు (దాత బొల్లె బాలయ్య), నాలుగో బహుమతి రూ.30వేలు ( కట్టా జనార్ధన్‌రెడ్డి), ఐదో బహుమతి రూ.20 వేలు (తాండ్ర మల్లేష్) అందజేశారు. అదేవిధంగా ఉత్సవాల సందర్భంగా నిర్వ హించిన కోలాటాం, ట్రాక్టర్ రివర్స్, భజన, చిరుతల భజన పోటీల్లో గెలుపొందిన విజేతలకు దాత ల సహకారంతో బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచు చింతగాళ్ల శ్రీనివాసులు, ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి, నిర్వాహకులు కట్టా అనంతరెడ్డి, తిప్పర్తి నర్సింహ్మారెడ్డి, కొత్త పెద్ద జంగిరెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, నారాయణ్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి, బాలయ్య, రామచంద్రయ్య, లక్ష్మ య్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు.


