● మాజీ మంత్రి రాజకీయ డ్రామాలు ఆపాలి
● మేయర్ మమత
మెట్టుగడ్డ: కాంగ్రెస్ పార్టీయే బీసీలకు పెద్దపీట వేసిందన్న విషయాన్ని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ గుర్తించాలని మేయర్ మమత శ్రీనివాస్ అన్నారు. మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ తొలి బడ్జెట్ సమావేశంలో చోటు చేసుకున్న ప్రొటోకాల్ వివాదంపై ఆదివారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. బీఆర్‌ఎస్‌లో తన భర్తను నమ్మించి నడిరోడ్డుపై వదిలేసిన ఘనత మాజీ మంత్రిదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ బీసీ మహిళను మేయర్‌గా ఉన్నత స్థానంలో కూర్చొబెట్టిందన్నారు. బీసీ మహిళకు దక్కిన పదవిని జీర్ణించుకోలేక బీఆర్‌ఎస్ కార్పొరేటర్లను బయటకు రమ్మని.. కౌన్సిల్‌ను బహిష్కరించాలని చెప్పింది మీరు కాదా అని మాజీ మంత్రిని ఆమె ప్రశ్నించారు. బీసీ మహిళ మేయర్ అయితే సంతోషి ంచాల్సింది పోయి అవమానించేలా వ్యవహరించడం బాధాకరమన్నారు. కౌన్సిల్ సమావేశంలో ప్రొటోకాల్ ధిక్కరణ అనే అంశమే లేదని.. ఇది కేవల ం రాజకీయంగా సృష్టించిన వివాదం మాత్రమేనని అన్నారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన సమయంలో రాజకీయ డ్రామాలు చేయడం సరికాదన్నారు. రాజకీయాలకు అతీతంగా మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. సమావేశంలో కార్పొరేటర్లు రమేశ్‌గౌడ్, నర్సింహులు యాదవ్, రామస్వామి, పార్టీ నాయకుడు శ్రీనివాస్ ఉన్నారు.


