ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Mar 30 2026 12:56 PM | Updated on Mar 30 2026 12:56 PM

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆర్టీసీ జేఏసీ నాయకులు థామస్‌రెడ్డి, ఈదురు వెంకన్న కోరారు. మహబూబ్‌నగర్‌ ఆర్టీసీ డిపో ఎదుట ఆదివారం నిర్వహించిన గేట్‌మీటింగ్‌లో వారు పాల్గొని మాట్లాడారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి సమ్మె అనివార్యమన్నారు. ఎన్నికలకు ముందు కార్మికుల జీతభత్యాలు సవరిస్తామని, ఆర్టీసీలో యూనియన్లను పునరుద్ధరిస్తామని, ఖాళీలు భర్తీ చేస్తామని అనేక హామీలు ఇచ్చి.. తీరా అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే కార్మికులకు రావాల్సిన రెండు పీఆర్‌సీలు, ట్రేడ్‌ యూనియన్లపై ఉన్న ఆంక్షలు ఎత్తివేసి, యూనియన్‌లను పునరుద్ధరించాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి అపాయింటెడ్‌డే ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జి.లక్ష్మణ్‌గౌడ్‌, విజయబాబు, యాదయ్య, యాదగిరి, బసప్ప, అరవింద్‌, నర్సింలు, సత్యశీలారెడ్డి, డి.శ్రీనివాసులు, నారాయణ, చంద్రమోహన్‌, జీకేరావు, వెంకటయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement