రాజాపూర్: బీహార్ నుంచి గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్న వ్యక్తిని శనివారం ఎకై ్సజ్ అధికారులు పట్టుకుని కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే బాలానగర్ మండలంలోని మోతిఘనాపూర్ శివారులో నవదుర్గ స్టీల్ కంపెనీ పరిసర ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో ఏఈఎస్ నర్సింహ్మరెడ్డి ఆధ్వర్యంలో శనివారం చర్యలు చేపట్టారు. బాలానగర్ ఎకై ్సజ్ ఎస్‌ఐ నాగరాజు తనిఖీలు చేపట్టి బీహార్‌కు చెందిన రాజేంద్ర అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 424 గ్రాముల ఎండు గంజాయి 10 గ్రాముల గంజాయి చాక్లెట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. బీహార్ నుంచి కిలో రూ.5వేల చొప్పున తీసుకొచ్చి 5 గ్రాములకు రూ.400 చొప్పున ఎండు గంజాయి, రూ.50 ఒక గంజాయి చాక్లెట్ విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఎక్కడైన మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నట్లు తెలిస్తే 90300 19943 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. ఎకై ్సజ్ ఎస్‌ఐ మురళీమోహన్, హెడ్ కానిస్టేబుల్ సిద్దార్థ తదితరులు పాల్గొన్నారు.


