జాతీయ స్థాయి షూటింగ్‌ క్రీడలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయి షూటింగ్‌ క్రీడలకు ఎంపిక

Mar 29 2026 8:48 AM | Updated on Mar 29 2026 8:48 AM

మక్తల్‌: మండలకేంద్రంలోని గురుకులంతో పాటు వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు జాతీయస్థాయి షూటింగ్‌ బాల్‌ పోటీలకు ఎంపికై నట్లు రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోపాలం తెలిపారు. ఈ మేరకు సదరు విద్యార్థులను స్థానిక ఎంజేసీ పాఠశాలలో ఎస్‌ఐ–2 ఆచారి అభినందించి సర్టిఫికెట్లను అందజేశారు. ఈనెల 1 నుంచి 3 వరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి షూటింగ్‌ బాల్‌ పోటీల్లో జిల్లాకు చెందిన 24 మంది విద్యార్థులు ప్రతిభ చాటి జాతీయ స్థాయికి ఎంపికై నట్లు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ సల్లారెడ్డి, పీఈటీ స్వప్న, వార్టెన్‌ రాఘవచారి, శివకుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement