జగజ్జనని.. జోగుళాంబ | - | Sakshi
Sakshi News home page

జగజ్జనని.. జోగుళాంబ

Jan 19 2026 6:31 AM | Updated on Jan 19 2026 6:31 AM

జగజ్జ

జగజ్జనని.. జోగుళాంబ

భక్తులకు

ఇబ్బందులు రానివ్వం..

జోగుళాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. భక్తులకు చలువ పందిళ్లు, తాగునీటి వసతి, ప్రత్యేకంగా ప్రసాదం కౌంటర్లు ఏర్పాటుచేశాం. అన్నదాన సత్రంలో నిత్యాన్న ప్రసాదం ఉంటుంది.. సేవా సంస్థల నిర్వాహకులు సైతం భక్తులకు అన్నప్రసాదం అందజేస్తారు. కలశాలతో వచ్చే భక్తులకు ప్రత్యేక క్యూలైన్‌ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం. – దీప్తి,

ఈఓ, అలంపూర్‌ క్షేత్రం

అలంపూర్‌: అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదో శక్తిపీఠమైన అలంపూర్‌ శ్రీజోగుళాంబ అమ్మవారి ఆలయ వార్షిక బ్రహోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 23వ తేదీ వరకు ఐదు రోజులపాటు కొనసాగే బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఆలయ పాలకమండలి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. అలంపూర్‌ క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఉత్సవాల చివరి రోజున సహస్ర ఘట్టాభిషేక పూజలు విశేషంగా నిర్వహించనున్నారు. భక్తులకు జోగుళాంబ అమ్మవారు నిజరూప దర్శనభాగ్యం కలగనుంది.

కార్యక్రమాలు ఇలా..

19న అమ్మవారి ఆలయంలో ఉద యం 8 గంటలకు యాగశాల ప్రవేశం, పుణ్యాహవచనం, మహాగణపతి పూజ, ఋత్విక్‌వరణం, మహాకలశ స్థాపన, సాయంత్రం ఉత్సవాలకు అంకురార్పణ, ధ్వజారోహణం కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

20 నుంచి 22వ తేదీ వరకు విశేష అర్చనలు, చండీ హోమాలు, పవమానసూక్త పారాయణం, పవమాన సూక్త హోమాలు, అవాహిత దేవతా హోమాలు, మండపారాధన, బలిహరణం, నీరాజన మంత్రపుష్పం పూజలు ఉంటాయి.

23న అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా యాగశాలలో నిత్య హోమాలు, మహా పూర్ణాహుతి, కలశ ఉద్వాసన, సహస్ర ఘట్టాలకు ఆవాహన అర్చన, అనంతరం జోగుళాంబ అమ్మవారి (మూలమూర్తి)కి అవభృతస్నాపనం, పంచామృతాలతో అభి షేకాలు, సహస్ర కలశాలతో అభిషేకాలు చేస్తారు. అనంతరం భక్తులకు అమ్మవారి నిజరూప దర్శనం ఉంటుంది. సాయంత్రం 4 గంటలకు శ్రీబాలబ్రహ్మేశ్వర స్వామి, జోగుళాంబ అమ్మవారి శాంతి కల్యాణం నిర్వహిస్తారు.

నేటి నుంచి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

ఏర్పాట్లు పూర్తిచేసిన ఆలయ పాలకమండలి

భక్తులకు నిజరూప దర్శనమివ్వనున్న అమ్మవారు

జగజ్జనని.. జోగుళాంబ 1
1/2

జగజ్జనని.. జోగుళాంబ

జగజ్జనని.. జోగుళాంబ 2
2/2

జగజ్జనని.. జోగుళాంబ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement