నిర్వాసితులది న్యాయమైన పోరాటం
చారకొండ: ఎర్రవల్లి, ఎర్రవల్లి తండాలను గోకారం జలాశయం ముంపు నుంచి మినహాయించాలంటూ ఆయా గ్రామస్తులు చేస్తున్న పోరాటం న్యాయమైందని పాలమూరు అధ్యయన వేదిక నాగర్‌కర్నూల్ జిల్లా కన్వీనర్ రాఘవాచారి అన్నారు. ముంపు నుంచి మినహాయించాలని, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ జీఓను రద్దు చేయాలంటూ ఆయా గ్రామస్తులు చేపట్టిన రిలే దీక్షలు గురువారం 10వ రోజుకు చేరాయి. గురువారం రాఘవాచారితో పాటు కల్వకుర్తి కన్వీనర్ వెంకట్‌గౌడ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ షాబాజ్‌ఖాన్, కల్వకుర్తి జేఏసీ చైర్మన్ సదానందంగౌడ్ దీక్షా శిభిరాన్ని సందర్శించి వారికి మద్దతు పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామస్తులు ఉన్న ఫలంగా గ్రామాలు ఖాళీ చేయాలంటూ సర్వం కోల్పోతున్నారని, వారి న్యాయమైన డిమాండ్ జలాశయం సామర్థ్యం తగ్గించి వెంటనే జీఓ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.


