షార్ట్ సర్క్యూట్‌తో గుడిసె దగ్ధం
కృష్ణా: షార్ట్ సర్క్యూట్‌తో గుడిసె దగ్ధమై తీవ్ర నష్టం వాటిల్లింది. గుడెబల్లూర్ గ్రామంలోని మారుతీనగర్‌లో గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఎండీ బాబు రోజు మాదిరిగానే పిల్లలను బడిలో దింపేందుకు వెళ్లాడు. భార్య కూలి పనికి వెళ్లగా ఇంట్లో అకస్మాత్తుగా కరెంట్ వైర్లకు నిప్పంటుకొని గుడిసె మొత్తం కాలిపోయింది. ప్రమాదంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి అప్పుగా తీసుకొచ్చిన రూ.1.50 లక్షలతో పాటు బంగారు, వెండి నగలు, నిత్యవసర సరుకులు కాలిపోయాయి. దీంతో సర్వం కోల్పోయామని ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
జడ్చర్లలో ఎస్‌బీఐ ఏటీఎం..
జడ్చర్ల: పట్టణంలోని సిగ్నల్‌గడ్డ ప్రాంతంలో తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎం గురువారం దగ్ధమైంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో కేంద్రంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి పొగలు రావడంతో స్థానికులు గుర్తించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో వారు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగి ఉంటాయని బ్యాంకు అధికారులు భావిస్తున్నారు. యంత్రంలోని నగదుకు మంటలు వ్యాపించనట్లు చెప్పారు. సాంకేతిక నిపుణులు పరిశీలించి నివేదిక ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఇందుకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సీఐ కమలాకర్ తెలిపారు.
షార్ట్ సర్క్యూట్‌తో గుడిసె దగ్ధం


