వృద్ధాప్యంలోనూ ఓటు స్ఫూర్తి
ఆనందంగా ఉంది..
మొదటిసారి ఓటుహక్కు వినియోగించుకోవడం సంతోషంగా ఉంది. ఓటు వజ్రాయుధం లాంటిది.. నీతి, నిజాయితీ, ధర్మంగా ఓటును వినియోగించుకుంటేనే ప్రశ్నించే హక్కు ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి.
– యార దీపిక, తాడూరు
మంచి నాయకుడిని
ఎన్నుకుంటేనే..
సర్పంచ్ ఎన్నికలో పార్టీలకతీతంగా ఎవరు గ్రామాభివృద్ధికి పని చేస్తారో వారిని గుర్తించి మొదటిసారి వచ్చిన ఓటు హక్కును వినియోగించుకున్నా. ఓటుహక్కుతో సర్పంచ్‌ను ఎన్నుకోవడం ఆనందంగా ఉంది. సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకునేందుకు భవిష్యత్‌లోనూ ఓటును ఉపయోగిస్తా.
– మధు, తాడూరు
వృద్ధాప్యంలోనూ ఓటు స్ఫూర్తి


