నేటి నుంచి అండర్–19 హ్యాండ్‌బాల్ టోర్నీ
● హాజరుకానున్న పది ఉమ్మడి జిల్లాల జట్లు
● 340 మంది క్రీడాకారులు, 40 మంది అఫీషియల్స్ రాక
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలోని మహబూబ్‌నగర్ హై స్కూల్‌లో రెండు కోర్టుల్లో శుక్రవారం నుంచి ఈ నెల 14 తేదీ వరకు 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్రస్థాయి అంతర్ జిల్లా బాల, బాలికల అండర్–19 రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ టోర్నీ నిర్వహించనున్నారు. రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్ హ్యాండ్‌బాల్ టోర్నీలో ఉమ్మడి జిల్లాలైన మహబూబ్‌నగర్, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, మెదక్, నల్గొండకు చెందిన బాల, బాలికల జట్లు పాల్గొంటున్నాయి. టోర్నీలో బాల, బాలికలు కలిపి 340 మంది క్రీడాకారులు, 40 మంది అఫీషియల్స్ పాల్గొననున్నారు. ఈ టోర్నీలో రాణించే క్రీడాకారులను ఎస్‌జీఎఫ్ అండర్–19 జాతీయస్థాయి టోర్నీల్లో పాల్గొనే తెలంగాణ జట్లకు ఎంపిక చేయనున్నారు.
క్రీడాకారులకు వసతి
హ్యాండ్‌బాల్ టోర్నీలో పాల్గొనే బాలుర క్రీడాకారులకు హీరా మాడల్ స్కూల్‌లో వసతి ఏర్పాటు చేయగా.. అక్కడే మ్యాచ్‌లు జరగనున్నాయి. బాలికలకు మహబూబ్‌నగర్ హైస్కూల్‌లో వసతితో పాటు అక్కడే మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు మహబూబ్‌నగర్ హైస్కూల్‌లో పోటీలు ప్రారంభమవుతాయి. గురువారం మహబూబ్‌నగర్ హైస్కూల్‌లో రాష్ట్రస్థాయి టోర్నీ ఏర్పాట్లను జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ శారదాబాయి పరిశీలించారు. కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ శాంత, సీనియర్ పీడీ వేణుగోపాల్, ఎండీ జియావుద్దీన్, ప్రదీప్‌కుమార్, రంజిత్, శివుడు తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లా బాలుర జట్టు
కె.మహేష్, ఆర్.ఉమేష్ కుమార్, ఆర్.గణేష్, విశాల్‌నాయక్, ఎండీ జుబేర్, బి.ప్రేమ్‌వసంత్, మహ్మద్ రజియోద్దీన్, పి.శ్రీను, ఎం.సక్కురామ్, ఎండీ జైనోద్దీన్, వినయ్, వి.యోగేశ్వర్, ఎస్.చరణ్‌తేజ్, ఎం.రాజేష్, ఎం.జగన్నాథ్, పి.దినేష్, స్టాండ్‌బై ఎ.రేవంత్‌రెడ్డి, ఎం.మహేష్, ఎం.విష్ణు
బాలికల జట్టు
కె.లక్ష్మీప్రియ, జి.సంద్య, జి.జ్యోతి, ఎం.రాధిక, పి.జానుబాయి, పి.లాస్యప్రియ, సయ్యద్ యాస్మీన్, పి.శ్రవంతిక, ఎం.సుమతి, పి.బిందుప్రియ, ఎ.స్నేహలత, సి.శివాని, టి.మాళవిక, బి.శైలజ, ఎండీ ఆఫ్రిన్, కె.దివ్య, స్టాండ్‌బై ఎస్.అక్షిత, కె.కావేరి, జి.అంజలి, కె.భానుప్రియ


