యువత పలుకులు..
ఓటు విలువైంది..
ప్రజాస్వామ్యంలో ఓటు విలువైంది. గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. ఓటరు స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.
– అమ్ములు, జంగమాయపల్లి
(పెద్దమందడి)
ఓటుతోనే మార్పు..
ప్రజాస్వామ్యంలో పౌరుడిగా ఓటింగ్‌లో పాల్గొనడం ప్ర త్యేకంగా అనిపించింది. ఓటు విలువ తె లుసుకొని గ్రామాభివృద్ధికి పాటుపడే వారినే గెలిపించాలి. యువత రాజకీయ అవగాహన పెంచుకొని తప్పనిసరిగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి.
– అరుణ్‌రెడ్డి, బలిజపల్లి (పెద్దమందడి)
ప్రజాస్వామ్యానికి పునాది
కల్వకుర్తి రూరల్: ఓటు అనేది ప్రజాస్వామ్యానికి పునాది లాంటిది. మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకున్న. ప్రస్తుతం బీటెక్ చదువుతున్నాను. సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వేయడం ఎంతో సంతోషంగా ఉంది.
– తలసాని అక్షిత, మార్చాల
సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వేశా
మొదటిసారి సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వేశా. ఓటు వేసే సమయంలో ఎంతో సంతోషం కలిగింది. ఈ జ్ఞాపకం మరిచిపోలేను. మార్చాలలో ఓటు హక్కు వినియోగించుకున్నాను. పోలింగ్‌పై అవగాహన వచ్చింది. – జాహ్నవి, ఎంబీఏ విద్యార్థిని
యువత పలుకులు..
యువత పలుకులు..
యువత పలుకులు..
యువత పలుకులు..


