యువతకు ఉపాధి అవకాశాలు: యెన్నం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: పాలమూరు నగరంలోని బోయపల్లిగేట్ సమీపంలో అధునాతన స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం మోతి మసీదు వద్ద ఈ కేంద్రం కోసం స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీనికి మైనారిటీ నిధుల నుంచి రూ.50 లక్షలు కేటాయించామన్నారు. జిల్లా కేంద్రంలోని యువతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వృత్తి నైపుణ్యాలను అందించే దిశగా కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్‌ఖాద్రీ, మాజీ కౌన్సిలర్లు ఖాజాపాషా, రాషెద్‌ఖాన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అజ్మత్‌అలీ, ఎం.డి.ఇబ్రహీం, అతీఖ్‌అహ్మద్, ఇలియాజ్ తదితరులు పాల్గొన్నారు.


