బావ X బావమరిది
అధికారుల తడబాటు
ప్రచారానికి అనుమతి తప్పనిసరి
కొండారెడ్డిపల్లి ఉపసర్పంచ్‌గా వేమారెడ్డి
వంగూరు: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత గ్రామం వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామపంచాయతీ ఎన్నిక ఏకగ్రీవం కావడంతో గురువారం ఉపసర్పంచ్ ఎన్నిక కూడా నిర్వహించారు. పది మంది వార్డుసభ్యులు కలిసి ఉపసర్పంచ్‌గా వేమారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇదిలాఉండగా.. ఉపసర్పంచ్‌గా మేఘారెడ్డి ఎన్నికవడం ఇది మూడోసారి. ఎన్నికల అధికారులు వార్డు సభ్యులందరికీ ఎన్నిక పత్రాలను అందజేసి ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వెంకటయ్య, ఉసర్పంచ్ వేమారెడ్డి మాట్లాడుతూ.. నిరంతరం కొండారెడ్డిపల్లి గ్రామప్రజలకు అందుబాటులో ఉంటూ.. గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో రైతు కమిషన్ సభ్యుడు కేవీఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నవాబుపేట: మండలంలోని పోమాల్ క్లస్టర్‌లో మొదటి విడత నామినేషన్ల అనంతరం గుర్తుల కేటాయింపులో తీవ్ర నిర్లక్ష్యం చోటు చేసుకుంది. బుధవారం సాయంత్రం అభ్యర్థుల జాబితా ప్రకటించి మొదట గుర్తులు కేటాయించారు. అర్ధరాత్రి దాటాక తిరిగి గుర్తులను మార్చడంతో అభ్యర్థులకు అయోమయానికి గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. ఈ క్లస్టర్ పరిధిలో పోమాల్‌తో పాటు కామారం, తిమ్మయ్యపల్లి, పుట్టోనిపల్లితండా గ్రామపంచాయతీలు ఉన్నాయి. పుట్టోనిపల్లితండా ఏకగ్రీవం కాగా.. మిగిలిన మూడు గ్రామాల అభ్యర్థులకు గుర్తులు కేటాయించాల్సి ఉంది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం సాయంత్రం అభ్యర్థుల జాబితా ప్రకటించకుండా మౌఖికంగా గుర్తులు చెప్పారు. దీంతో పోమాల్‌లో కొందరు అభ్యర్థులు ప్రచారం కూడా ప్రారంభించారు. అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత వేరే గుర్తులు కేటాయించారు. దీంతో అభ్యర్థులు బుధవారం రాత్రి ఒక గుర్తుపై.. తాజగా గురువారం మరో గుర్తును ప్రచారం చేశారు. ఈ విషయంపై ఆరాతీస్తే అభ్యర్థుల ఇంటిపేర్లు తదితర వాటి విషయాల్లో అధికారులు తడబడ్డారని.. అందుకే జాప్యం జరిగినట్లు సమాచారం.
● సర్పంచ్ స్థానానికి పోటీ
కల్వకుర్తి రూరల్: మండలంలోని జీడిపల్లి గ్రామపంచాయతి సర్పంచ్ స్థానం జనరల్‌కు కేటాయించారు. ఈ పదవి కోసం మంగ మల్లేష్, కెంచె ఆంజనేయులు పోటీ పడుతున్నారు. ఇద్దరూ వరుసకు బావ, బావమరిది. ఒకరింటికి ఒకరు పిల్లను ఇచ్చుకున్నారు. ఇద్దరూ కాంగ్రెస్‌పార్టీలోనే ఉన్నారు. అయితే పార్టీ అధికారికంగా ఆంజనేయులుకు మద్దతు ఇవ్వగా.. మల్లేష్‌కు కాంగ్రెస్‌లోని ఓ వర్గంతో పాటు బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీ సైతం మద్దతుగా నిలిచాయి. ఇద్దరూ మొదటిసారి ఎన్నికల బరిలో నిలిచి పోటీపడటం ప్రత్యేకం.
మహబూబ్‌నగర్ క్రైం: ఎన్నిక ఏదైనా సరే.. ప్రచారానికి లౌడ్‌స్పీకర్లు, మైకులు, అభ్యర్థులతో సభలు, సమావేశాలు, రోడ్‌షోలు నిర్వహిస్తారు. దీంతో విద్యార్థుల చదువుకు ఆటంకం కలగడమేగాక వృద్ధులు, చిన్నారులు, చికిత్స పొందుతున్న రోగులకు అసౌకర్యంగా ఉంటుంది. వీటిని పరిగణలోకి తీసుకున్న ఎన్నికల సంఘం.
అభ్యర్థి ఫొటోలతో జెండాలు పాతడం, గోడలపై పోస్టర్లు అతికించడం, స్లోగన్లు రాయొద్దు.
రెచ్చగొట్టే ప్రసంగాలు, అభ్యర్థుల వ్యక్తిగత జీవితాలపై ఆరోపణలు చేయరాదు.
ప్రచార సమయంలో లౌడ్‌స్పీకర్ల వినియోగానికి తప్పక అనుమతి తీసుకోవాలి. నివాస ప్రాంతాల్లో పగలు 55 డీబీ, రాత్రి 45 డీబీ, వాణిజ్య ప్రాంతాల్లో పగలు 65 డీబీ, రాత్రి 55 డీబీ, పారిశ్రామిక ప్రాంతాల్లో పగలు 75 డీబీ, రాత్రి 70 డీబీ పరిమితితో ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు మాత్రమే లౌడ్‌స్పీకర్లు వినియోగించాలి.
అభ్యర్థుల ప్రచార వివరాలు, ఊరేగింపు సమయం, స్థలం వంటి వివరాలు ముందే తెలియజేయాలి. ట్రాఫిక్, ఇతర సాధారణ ప్రజలకు ఆటంకం కలగకుండా జాగ్రత్తలు పాటించాలి.
గుర్తుల కేటాయింపులో ఆలస్యం
బావ X బావమరిది
బావ X బావమరిది


