నేటి నుంచి కబడ్డీ చాంపియన్‌షిప్
ఇండోర్ స్టేడియంలో రాష్ట్రస్థాయి జూనియర్ బాలుర పోటీలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా కేంద్రం మరో రాష్ట్రస్థాయి క్రీడా సంగ్రామానికి వేదికై ంది. శుక్రవారం నుంచి ఈ నెల 7వ తేదీ వరకు జిల్లా కేంద్రంలోని మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో 51వ రాష్ట్రస్థాయి అంతర్ జిల్లా జూనియర్ బాలుర కబడ్డీ చాంపియన్‌షిప్ జరగనుంది. గురువారం ఇండోర్ స్టేడియంలో ఏర్పాట్లను జిల్లా కబడ్డీ అసోసియేషన్ సభ్యులు పరిశీలించారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు శాంతికుమార్, ఉపాధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి సహకారంతో టోర్నీ విజయవంతం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కార్యదర్శి కురుమూర్తిగౌడ్ తెలిపారు.
476 మంది క్రీడాకారులు..
జూనియర్ కబడ్డీ రాష్ట్రస్థాయి పోటీలకు రాష్ట్రంలోని 34 బాలుర జట్లు హాజరుకానున్నాయి. 476 మంది క్రీడాకారులు, 70 మంది అఫిషియల్స్‌తో కలిపి దాదాపు 800 మంది పాల్గొంటున్నారు. క్రీడాకారులకు మాడ్రన్ స్కూల్, టీఎన్‌జీఓ భవన్, అంబేడ్కర్ కళాభవన్, బీపీహెచ్‌ఎస్, స్కౌట్స్ భవన్‌లో వసతి, భోజన సౌకర్యం కల్పించారు. ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన నాలుగు మ్యాట్‌లపై లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో దాదాపు 90 మ్యాచ్‌లు జరగనున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించే ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి, 7న జరిగే పోటీల ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర క్రీడల వ్యవహారాల సలహాదారులు ఏపీ జితేందర్‌రెడ్డి పాల్గొననున్నారు.
జిల్లా బాలుర కబడ్డీ జట్టు
● రాష్ట్రస్థాయి జూనియర్ టోర్నీలో ప్రతిభచాటేలా జిల్లా బాలుర జట్టుకు కొన్ని రోజుల నుంచి ఇండోర్ స్టేడియంలో ప్రత్యేక కోచింగ్ క్యాంప్ నిర్వహించారు.
● జిల్లా జట్టులో.. పాండు, సురేష్, శివకుమార్, అరవింద్, రాంచరణ్, హేమంత్, కౌషిక్, నందీశ్వర్, చందు, గౌతమ్, దేవ్‌సింగ్, శివప్రసాద్, హర్షవర్ధన్, మణికంఠ.
పోటీలో 34 జట్లు
నాలుగు కోర్టులు, 90 మ్యాచ్‌లు
ఏర్పాట్లు చేసిన జిల్లా కబడ్డీ
అసోసియేషన్
నేటి నుంచి కబడ్డీ చాంపియన్‌షిప్


