భార్య విడాకులు తీసుకుందని భ ర్త ఆత్మహత్య
మిడ్జిల్: భార్య విడాకులు తీసుకుందనే మనస్థాపంతో మండలంలోని బోయిన్‌పల్లికి చెందిన పిట్టల సత్యనారాయణ (28) ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. సత్యనారాయణకు ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. భార్య కేవలం వారం రోజులు మాత్రమే ఉండి ఇటీవల విడాకులు తీసుకోవడంతో అతడు తీవ్ర మనస్థాపానికి లోనయ్యాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్రపోయాడు. గురువారం ఉదయం ఇంట్లో నుంచి ఎంతకూ బయటకు రాకపోవడంతో అతడి తల్లి అలివేల తలుపు తెరిచి చూడగా ఫ్యాన్‌కు ఉరి వేసుకొని కన్పించాడు. గ్రామస్తులు వచ్చి కిందకు దింపగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. ఘటనపై ఎస్‌ఐ శివనాగేశ్వర్‌నాయుడును వివరణ కోరగా.. ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.


