గగన్‌చంద్ర పరిశోధనలకు సహ కరిస్తాం
బల్మూర్: మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో 10వ తరగతి చదువుతూ త్రీ ఇన్ వన్ సైకిల్‌ను రూపొందించిన విద్యార్థి గగన్‌చంద్రను విజ్ఞాన పరంగా అతను చేసే పరిశోధనలకు షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ నుంచి ప్రోత్సాహం అందిస్తామని కమిషనర్ క్షితిజ తెలిపారు. ఈ నెలలో భోపాల్‌లో జరిగిన జాతీయ స్థాయి విజ్ఞాన ప్రదర్శనలో త్రీ ఇన్ వన్ సైకిల్‌ను ప్రదర్శించి యంగ్ సైంటిస్ట్ అవార్డు అందుకున్న విద్యార్థి గగన్‌చంద్రను గురువారం హైదరాబాద్‌లో ఎస్సీ డీడీ కార్యాలయంలో కమిషనర్ అభినందించారు. ఏసీడీఓ ఉమాపతి, జేడీ శ్రీనివాస్‌రెడ్డి, అధికారులు వార్డెన్ కృష్ణయ్య, శ్రీధర్, రమాదేవి, సల్మాభాను, శ్రవణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


