స్థానిక బ్యాలెట్‌లో నోటా | - | Sakshi
Sakshi News home page

స్థానిక బ్యాలెట్‌లో నోటా

Nov 29 2025 7:39 AM | Updated on Nov 29 2025 7:39 AM

స్థాన

స్థానిక బ్యాలెట్‌లో నోటా

నోటాతో ఫలితాలు తారుమారు

అవగాహన అవసరం

పంచాయతీ ఎన్నికల్లో బ్యాలెట్‌ పేపర్‌పై నోటా గుర్తును ముద్రించనుండటంతో పల్లెల్లో అఽధికారులు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటీవల సాధారణ ఎన్నికల్లో ఈవీఎంలలో నోటా గుర్తుపై ప్రజలకు వివరించారు. పల్లెలో ఎక్కవగా నిరక్షరాస్యులు ఉన్నందున నోటా గుర్తుపై క్షేత్రస్థాయిలో మరింతగా ప్రచారం చేయాల్సి ఉంది.

ఓట్లు సమానంగా వచ్చినప్పుడు..!

పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఇద్దరికి సమానంగా ఓట్లు వచ్చినప్పుడు లాటరీ ద్వారా అంతిమ ఫలితాన్ని నిర్ణయిస్తారు. లాటరీ ఏ అభ్యర్థికి అనుకూలంగా వస్తుందో ఆ అభ్యర్థికి ఒక అదనపు ఓటు వచ్చినట్లుగా భావించి విజేతగా ప్రకటిస్తారు. సరిసమాన ఓట్లు పొందిన అభ్యర్థుల పేర్లను సమాన రంగు, పరిమాణం కలిగిన ఐదేసి చీటీలపై ఆర్‌ఓ రాసి వాటిని గుర్తించకుండా కలపాలి. ఆర్‌ఓ ఒక చిటీని డ్రా తీయగా దాంట్లో ఎవరి పేరైతే వస్తుందో ఆ అభ్యర్థి గెలుపొందినట్లు ప్రకటిస్తారు.

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌)/పాలమూరు: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌, వార్డు సభ్యుడిగా పోటీ చేసే అభ్యర్థి నచ్చకపోతే నోటాకు ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల కమీషన్‌ ఈసారి ఓటర్లకు కల్పించింది. తొలిసారిగా అమలు చేస్తున్న నోటాపై పల్లె ప్రజలకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. సాధారణ ఎన్నికలతో పోలిస్తే పంచాయతీ ఎన్నికలు గ్రామాల అభివృద్ధికి కీలకం, బరిలో నిలిచిన ప్రతి అభ్యర్థికి ప్రతీ ఓటు కీలకమే. ఒకటి, రెండు ఓట్ల తేడాతో అభ్యర్థులు ఓడిపోయిన సందర్భాలు అనేకం. అయితే ఈసారి బ్యాలెట్‌ పేపర్‌లో ఎన్నికల కమీషన్‌ నోటాకు సైతం అవకాశం ఇవ్వడంతో పలువురు అభ్యర్థుల్లో వణుకు మొదలైంది.

పంచాయతీ ఎన్నికల్లో తొలిసారిగా ప్రవేశ పెడుతున్న నోటా గుర్తు వల్ల ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశాలున్నాయి. నోటా కూడా ఓ అభ్యర్థి గుర్తుగానే భావించే అవకాశాలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నిరక్షరాస్యులు తెలియక ఓటు వేస్తే అది నోటా కిందకు వెళ్తుంది. సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ ఎన్నికల్లో 300 నుంచి 10 వేల వరకు ఓటర్లు గల పంచాయతీలు ఉన్నాయి. వెయ్యి మంది ఓటర్లు గల పంచాయతీలు 60 శాతానికి పైగా ఉన్నాయి. వార్డుల్లో 50 నుంచి 200కు పైగా ఓటర్లు ఉంటారు. సర్పంచ్‌, వార్డు సభ్యుల ఫలితాలు ఒకటి, రెండంకెల ఓట్ల తేడాతో ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నోటా గురించి గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పించకపోతే గెలుపోటములు తారుమారయ్యే ప్రమాదం ఉంటుందని పలువురు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

టీఈ–పోల్‌ యాప్‌

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు సులభంగా ఎన్నికల సమాచారం అందించేందుకు ఎన్నికల సంఘంతో పాటు తెలంగాణ ప్రభుత్వం టీఈ– పోల్‌ మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. జిల్లాలోని పోలింగ్‌ కేంద్రాల వివరాలు, ఓటర్‌ స్లిప్పులు, ఎన్నికల నిర్వహణలో ఫిర్యాదులను యాప్‌లో చేయవచ్చు. గూగుల్‌ ప్లేస్టోర్‌లో యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని ఎన్నికల స్టేటస్‌ తనిఖీ, ఓటర్‌ స్లిప్‌, పోలింగ్‌ స్టేషన్‌ వివరాలు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

మొదటిసారిగా స్థానిక ఎన్నికల్లో

స్థానిక బ్యాలెట్‌లో నోటా
1
1/2

స్థానిక బ్యాలెట్‌లో నోటా

స్థానిక బ్యాలెట్‌లో నోటా
2
2/2

స్థానిక బ్యాలెట్‌లో నోటా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement