రాములోరి రథోత్సవం | - | Sakshi
Sakshi News home page

రాములోరి రథోత్సవం

Apr 1 2026 10:59 AM | Updated on Apr 1 2026 10:59 AM

రమణీయం..

చారకొండ: అపర భద్రాద్రిగా విరాజిల్లుతు న్న సిర్సనగండ్ల శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహోత్సవాల్లో భాగంగా మంగళవారం పెద్ద రథోత్సవం (పెద్దతేరు) తెల్లవారుజామున అత్యంత రమణీయంగా జరిగింది. వేడుకలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. భక్తుల జయజయ ధ్వానా ల మధ్య రంగురంగుల పూలతో శోభాయమానంగా అలంకరించిన రథంపై సీతారామలక్ష్మణ ఉత్స వ విగ్రహాలను ఉంచి అర్చకులు ప్రత్యేక పూజ లు చేశారు. అనంతరం ఆలయ చైర్మన్‌ రామశర్మ, ఈఓ అంజనేయులు రథాన్ని లాగి, ముందుకు కదిలించారు. ప్రధాన అలయం నుంచి ముక్కిడి పొచమ్మ, దత్తాత్రేయ ఆలయం వరకు రథాన్ని తీసుకొచ్చారు. వేడుక సోమవారం అర్ధరా త్రి నుంచి తెల్లవారుజాము న 6 గంటల వరకు సాగగా.. ఆలయ ప్రాంగణం శ్రీరామనామస్మ రణతో మార్మోగింది. భక్తులు సోమవారం రాత్రి ఆలయ గుట్టపై చేరుకొని జాగరణ చేశారు. రథోత్సవంలో కళాకారులు ఆటపాటలు ఆకట్టుకున్నాయి. రాత్రికి స్వామివారికి నాగబలి, పూర్ణాహుతి, గజవాహన సేవ, దీపోత్సవం కార్యక్రమాలు నిర్వహించారు.

రథోత్సవం ప్రారంభిస్తున్న

ఆలయ చైర్మన్‌, ఈఓ తదితరులు

అంగరంగ వైభవంగా పెద్ద తేరు మహోత్సవం

జనసంద్రమెన సిర్సనగండ్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement