రథోత్సవ వేడుకలో వేలాది మంది భక్తులు పాల్గొనడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీఐ రఘువీర్‌రెడ్డి, ఎస్‌ఐ వీరబాబు అధ్వర్యంలో దాదాపుగా 3 వందల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గుట్టపైకి వాహనాలు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. రథోత్సవ వేడుక అనంతరం భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూలైన్‌లో బారులుతీరారు. స్వామివారి దర్శనం అనంతరం అమ్మవారు, శివదత్తాత్రేయ ఆలయాలను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ నిరంజన్, అర్చకులు లక్ష్మణ్‌శర్మ, అనంత శర్మ, కోదండ రామశర్మ, ప్రవీణ్‌శర్మ, మురళీధర్ శర్మ, సర్పంచ్‌లు, నాయకులు ఉన్నారు.


