ఈర్లదిన్నె ‘చుక్క’ సొంతం
ఊరంతా పచ్చని చెట్లు
ఈర్లదిన్నె గ్రామంలో మొత్తం జనాభా 1,600 ఉండగా 8 వార్డులు, 900 మంది ఓటర్లు ఉన్నారు. జూరాల బ్యాక్ వాటర్ వెనుక ఉండటంతో గ్రామంలో పచ్చదనానికి కొదవలేదు. గ్రామంలోని అన్ని కాలనీలతో పాటు ఇంటింటికి మొక్కలు నాటించడంతో ప్రస్తుతం పచ్చని చెట్లతో గ్రామం ఆహ్లదకరంగా మారింది. వీటికి తోడు ఎప్పడికప్పుడు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం చెత్తను మురుగుకాల్వలో వేయకుండా అప్పట్లోనే రిక్షాలను తెప్పించడంతో గ్రామాన్ని బెస్ట్ విలేజ్‌గా ప్రభుత్వం ఎంపిక చేసింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని తమ గ్రామం ఇతరులకు ఆదర్శంగా ఉండాలనే సంకల్పంతో అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.
అమరచింత: పంచాయతీ ఎన్నికలంటే గ్రామంలో పోటీ చేసేందుకు ఎందరో ఆసక్తి చూపుతుంటారు. ఎప్పుడు సర్పంచ్ పదవిని చేపట్టాలని ఆశగా ఎదురు చూస్తంటారు కానీ మండలంలోని ఈర్లదిన్నె గ్రామంలో మాత్రం 35 ఏళ్లుగా ఒకే కుటుంబానికి చెందిన వారు సర్పంచ్‌లుగా ఎన్నికల్లో గెలిచి గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తూ ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతున్నారు. సర్పంచ్‌గా గెలవడమే కాదు గ్రామానికి ఏంచేస్తే బాగుంటుంది. గ్రామ ప్రజలు ఎలా బాగుంటారు అన్న ఆలోచనలతో ముందకు వెళ్తూ గ్రామ పరిపాలనపై తమదైన ముద్ర వేసుకున్నారు చుక్క వంశీయులు.
మొదటిసారి..
చుక్క కుటుంబం నుంచి మొదటిసారిగా చుక్క లింగారెడ్డి సర్పంచ్‌గా ఎన్నిక తరువాత అదే కుటుంబం నుంచి చుక్క ఆశిరెడ్డి, చుక్క లక్ష్మమ్మ సర్పంచ్‌లుగా గెలుపొంది గ్రామ పరిపాలనలో తమదైన శైలితో అభివృద్ధి పనులు చేస్తూ గ్రామ ప్రజలను మెప్పించారు. కేవలం పరిపాలనే కాకుండా గ్రామస్తుల్లో ఎవ్వరికి ఎలాంటి ఆపద వచ్చిన తామున్నమంటూ ఆదుకొంటున్న కుటుంబాన్నే గ్రామ ప్రజలు ఆదరిస్తూ వస్తున్నారు. ఈ సారి సర్పంచ్ పదవి సైతం అదే కుటుంబానికి వరిస్తున్నా.. చుక్క కుటుంబం మాత్రం ఎంపీపీ పదవిపై మక్కువ చూపున్నట్లు తెలిసింది. గ్రామానికే పరిమితం కాకుండా తమ పరిపాలన మార్క్‌ను మండలానికి విస్తరించే యత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈర్లదిన్నె వ్యూ
చుక్క లక్ష్మమ్మ, మూడో సర్పంచ్
సర్పంచ్‌ల పదవీ కాలం
చుక్క లింగారెడ్డి ఈర్లదిన్నె సర్పంచ్‌గా 1989లో ఎన్నికై రెండు పర్యాయాలు అంటే 1999 వరకు సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం చుక్క లింగారెడ్డి తమ్ముడు చుక్క ఆశిరెడ్డి 1999లో సర్పంచ్‌గా గెలిచి రెండు పర్యాయాలు 2009 వరకు కొనసాగారు. అనంతరం చుక్క ఆశిరెడ్డి సతీమణి చుక్క లక్ష్మమ్మ 2009లో సర్పంచ్‌గా గెలిచి మూడు పర్యాయాలు 2024 వరకు సర్పంచ్‌గా కొనసాగారు.
చుక్కవంశీయుల ఆస్థానంగా..
35 ఏళ్లుగా ఆ కుటుంబ సభ్యులే సర్పంచ్‌లు
1989 నుంచి 2024 వరకు బాధ్యతలు
గ్రామ పరిపాలనలో మమేకమైన వైనం
ఈర్లదిన్నె ‘చుక్క’ సొంతం


