మహబూబ్‌నగర్ రూరల్: మొదటి విడత ఎన్నికలు జరిగే సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ పత్రాలు క్లస్టర్ కేంద్రాలకు తరలించే విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించారు. మండలంలోని ధర్మాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన క్లస్టర్‌కు గురువారం ఉదయం 11 గంటలైనా నామినేషన్ పత్రాలు రాలే దు. అదే సమయంలో మంచి ముహూర్తం ఉండటంతో నామినేషన్ వేయడానికి వచ్చిన అభ్యర్థులు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. సుముహూర్తంలో నామినేషన్ దాఖలు చేయకపోవడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.


