అడ్డొస్తున్నాడని.. తుదముట్టించారు | - | Sakshi
Sakshi News home page

అడ్డొస్తున్నాడని.. తుదముట్టించారు

Nov 28 2025 11:55 AM | Updated on Nov 28 2025 11:55 AM

అడ్డొస్తున్నాడని.. తుదముట్టించారు

అడ్డొస్తున్నాడని.. తుదముట్టించారు

గద్వాల క్రైం: రాజకీయాలు.. భూ పంచాయితీ.. వ్యా పార వ్యవహారం.. ఇలా అన్నింటా అడ్డొస్తున్నాడని.. కేటీదొడ్డి మండలం నందిన్నె గ్రామ మాజీ సర్పంచ్‌ చిన్న భీమరాయుడు(40)ని హత్య చేయించినట్లు జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ నెల 21వ తేదీన బైక్‌ను గూడ్స్‌వాహ నం ఢీకొట్టిన ఘటనలో చిన్న భీమరాయుడు మృతిచెందాడు. మొదట ఇది రోడ్డు ప్రమాదని అందరూ అనుకోగా.. కుటుంబసభ్యుల అనుమానం మేరకు ద ర్యాప్తు చేపట్టిన పోలీసులు కేసును ఛేదించారు. ప్రధా న నిందితుడు మిల్లు వీర న్న సుపారీ గ్యాంగ్‌కు రూ. 25 లక్షలు ఇచ్చి హత్య చేయించి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని మాస్టర్‌ప్లాన్‌ వేశాడని తేల్చారు. ఈమేరకు 10 మంది నిందితులను అరెస్టు చేయడంతోపాటు రూ. 8.50 లక్షల నగదు, 4 కార్లు, గూడ్స్‌ వాహనం స్వాధీనం చేసుకోవడంతోపాటు 11 మొబై ల్స్‌, 13 సిమ్‌కార్డులను సీజ్‌ చేసినట్లు తెలిపారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలే కర్ల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు.

మొదటి నుంచి రాజకీయ వైరం..

కేటీదొడ్డి మండలం నందిన్నె గ్రామానికి చెందిన మిల్లు వీరన్న అలియాస్‌ కుర్వ వీరన్నకు.. చిన్న భీమరాయుడికి మధ్య మొదటి నుంచి రాజకీయ వైరంతో పాటు మిల్లు వ్యాపార వ్యవహారాల విషయంలో విభేదాలు ఉన్నాయి. అలాగే, చిన్న భీమరాయుడికి ఆయన బంధువైన బోయ వీరన్న అలియాస్‌ గబ్బర్‌ వీరన్నకు సైతం భూ పంచాయితీలు ఉన్నాయి. ఈ క్రమంలో ఇద్దరికీ చిన్న భీమరాయుడు సమస్యగా మారడంతో ఎలాగైన అతడిని అడ్డు తొలగించాలనే ద్వేషం పెంచుకున్నారు. తెలిసిన వ్యక్తుల ద్వారా కర్నూ లు జిల్లాకు చెందిన సుపారీ గ్యాంగ్‌ సభ్యులైన ఈశ్వర్‌గౌడ్‌ను మిల్లు వీర న్న, ఆయన కుమారుడు కుర్వ సురేందర్‌ కలిసి రూ.25 లక్షలకు హత్య చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అడ్వాన్స్‌గా రూ.8 లక్షలు అందజేశారు.

రెక్కి నిర్వహించి.. గూడ్స్‌ వాహనంతో ఢీకొట్టి..

చిన్న భీమరాయుడును హత్య చేసేందుకు సుపారీ గ్యాంగ్‌ సభ్యులు ఈశ్వర్‌గౌడ్‌, తెలుగు మధుబాబు(కర్నూలు జిల్లా పంచలింగల), తెలుగు కృష్ణ(తాండ్రపాడు, కర్నూలు జిల్లా), సంజీవులు(మదనపల్లి గద్వాల మండలం), బైరి సుంకన్న, బైరి కేశన్న అలియాస్‌ సంపోస్‌(పోలకల్‌, కర్నూలు జిల్లా), కుర్వ ప్రభుస్వామి అలియాస్‌ ప్రౌస్వామి (కేటీదొడ్డి మండలం నందిన్నె) హరిజన్‌ రాజేష్‌(పుట్టపాశం, కర్నూలు జిల్లా)లు కొన్నిరోజులుగా రెక్కీ నిర్వహించారు. ఈమేరకు బొలెరో గూడ్స్‌ వాహనం ముందు ఇనుప చువ్వలతో కూడిన గ్రిల్‌ను అమర్చుకున్నారు. పలుసార్లు హత్య చేసేందుకు ప్రయత్నించినా.. పరిస్థితులు అనుకూలించలేదు. ఈ నెల 21వ తేదీన చిన్న భీమరాయుడు గద్వాల నుంచి బైక్‌పై స్వగ్రామమైన నందిన్నెకు వెళ్తుండగా.. డ్రైవర్‌ తెలుగు కృష్ణ గూడ్స్‌ వాహనంతో వచ్చి ధరూర్‌ మండలం జాంపల్లి స్టేజీ సమీపంలో బైక్‌ను ఢీ కొట్టాడు. కొద్ది దూరం వాహనం సహా లాక్కెళ్లింది. దీంతో చిన్న భీమరాయుడు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌ గూడ్స్‌ వాహనం ముందు గ్రిల్‌లో ఇరుక్కుపోవడంతో ఆ వాహనాన్ని అక్కడే వదిలేశారు. గూడ్స్‌ వాహనం వెనుక మరో కారులో తెలుగు మధుబాబు ఫాలో అవుతూ వచ్చి అందులోని డ్రైవర్‌ను కారులో ఎక్కించుకుని పారిపోయారు. సుపారీ గ్యాంగ్‌ సభ్యులంతా కొత్త సిమ్‌ కార్డులు తీసుకొని.. వివిధ ప్రాంతాల్లో ఉంటూ సమాచారం చేరవేస్తూ వచ్చారు. ఈ హత్యను రోడ్డు ప్రమాదంగా నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే, ఈ ప్రమాదంపై మృతుడి సోదరుడు పెద్ద భీమరాయుడు అనుమానం వ్యక్తం చేస్తూ అదే రోజు ధరూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్‌ఐ శ్రీహరి, విచారణ అధికారి గద్వాల సీఐ శ్రీను కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

విచారణలో వెలుగులోకి నిజాలు..

తన సోదరుడు చిన్న భీమరాయుడి మృతిపై అనుమానం వ్యక్తం చేయడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరాల సహాయంతో నిందితుల కదలికలపై నిఘా ఉంచారు. అయితే గురువారం ఉదయం ఎర్రవల్లి మండల శివారులో సుపారీ గ్యాంగ్‌ సభ్యులు హత్యకు కుదుర్చుకున్న ఒప్పంద నగదు రూ.8.50 లక్షలు డ్రా చేసి తీసుకెళ్తున్నట్లు సమాచారం మేరకు వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితులను విచారించగా నేరం అంగీకరించారన్నారు. ఈ హత్యకు ప్రధాన సూత్రధారులు మిల్లు వీరన్న, కుర్వ సురేందర్‌, బోయ వీరన్నను అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ హత్య కేసులో 10మంది నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.8.50 లక్షల నగదు, 4 కార్లు, గూడ్స్‌ వాహనం, రెండు బైక్‌లు, 11 మొబైల్స్‌, 13 సీం కార్డులు స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశామని ఎస్పీ తెలిపారు. ప్రధాన నిందితులైన ఏ–1 మిల్లు వీరన్న, ఆయన కుమారుడు ఏ–2 కుర్వ సురేందర్‌పై కేటీదొడ్డి పోలీసు స్టేషన్‌లో కేసులు ఉన్నాయని పేర్కొన్నారు.

సిబ్బందికి రివార్డు

నందిన్నె మాజీ సర్పంచ్‌ చిన్న బీమరాయుడు హత్య కేసు ఛేదనలో సిబ్బంది సమష్టి కృషి ఉందని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఏఎస్పీ శంకర్‌, డీఎస్పీ మొగిలయ్య, సీఐలు శ్రీను, రవిబాబు, ఎస్‌ఐలు శ్రీహరి, శ్రీకాంత్‌, కళ్యాణ్‌కుమార్‌, మల్లేష్‌, నందికర్‌, అబ్దుల్‌షుకుర్‌, సిబ్బంది నాగరాజు, దామోదర్‌రెడ్డి, రమేష్‌, చంద్రయ్య, కిరణ్‌కుమార్‌, వీరేష్‌ తదితర సిబ్బందికి క్యాష్‌ రివార్డు అందజేశారు. సుపారీ గ్యాంగ్‌లోని ప్రధాన నిందితుడు ఈశ్వర్‌గౌడ్‌ పరారీలో ఉన్నాడని, త్వరలో అదుపులోకి తీసుకుంటామని, అరెస్టు చేసిన నిందితులను గద్వాల కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించనున్నట్లు ఎస్పీ తెలిపారు.

సుపారీ గ్యాంగ్‌ చేతిలో మాజీ సర్పంచ్‌ భీమరాయుడు హత్య

రాజకీయాలు, పాత కక్షలు, వ్యాపార వ్యవహారాల్లో విభేదాలే కారణం

రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం

ప్రధాన నిందితుడు మిల్లు వీరన్న మాస్టర్‌ప్లాన్‌.. రూ.25 లక్షలకు డీల్‌

10 మంది నిందితుల అరెస్టు

రూ.8.50 లక్షల నగదు, 4 కార్లు, గూడ్స్‌ వాహనం స్వాధీనం

కేసు వివరాలు వెల్లడించిన

ఎస్పీ శ్రీనివాసరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement