అర్హులకే అవకాశం
పాలమూరు/అచ్చంపేట/జడ్చర్లటౌన్/ జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): స్థానిక సంస్థ ల ఎన్నికల్లో పోటీకి అర్హతలపై అభ్యర్థులకు అనేక సందేహాలు ఉండవచ్చు. అలాంటి వారి కోస మే ఈ కథనం. ప్రస్తు తం నిర్వహిస్తున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుడిగా పోటీచేసేందుకు పలు వురు ఆసక్తి కనబరుస్తున్నారు. మొదటి విడతకు సంబంధించి ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ సైతం ప్రారంభమైంది. ఎన్ని కల్లో పోటీ చేయాలనుకునే వారికి ఈసీ నిబంధనల మేరకు అన్ని అర్హతలు తప్పనిసరిగా ఉండాలి.
● స్వీయ ప్రకటన కీలకం..
అభ్యర్థులు తమ నేరచరిత్ర, ఆస్తులు, అప్పులు, విద్యార్హతలకు సంబంధించి ఇద్దరు సాక్షులు ధ్రువీకరించిన స్వీయ ప్రకటన (అఫిడవిట్) నామపత్రంతో పాటు దాఖలు చేయాలని ఎన్నికల నిబంధనలు చెబుతున్నాయి. అభ్యర్థి తనతో పాటు కుటుంబ సభ్యులైన భార్య, భర్త, కుమార్తె, కుమారుడికి సంబంధించిన వివరాలను అఫిడవిట్‌లో పొందుపర చాలి. నామపత్రంలో గడులు ఖాళీగా వదలరాదు. అందులో తనకు వర్తిందని.. లేదా నదారత్ అని రాయాలి. లేకుంటే నామపత్రం తిరస్కరణకు గుర య్యే ప్రమాదం ఉంది. అఫిడవిట్ తప్పుగా ఇచ్చి నట్లు రుజువైతే క్రిమినల్ కేసు నమోదు అవుతుందని ఎన్నికల సంఘం నిబంధనలు చెబుతున్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అన్ని అర్హతలు తప్పనిసరి
21 ఏళ్లు నిండి.. గ్రామంలో
ఓటరుగా నమోదై ఉండాలి
కట్టుదిట్టంగా ఎన్నికల
నియమావళి అమలు
అర్హులకే అవకాశం


