
బాదేపల్లి పాఠశాలలో డీఈఓ విచారణ
జడ్చర్ల టౌన్: బాదేపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం మధ్యాహ్న భోజనంలో జెర్రి కనిపించిన ఘటనపై శుక్రవారం జిల్లా విద్యాధికారి ప్రవీణ్‌కుమార్ విచారణ జరిపారు. పాఠశాలకు చేరుకున్న ఆయన విద్యార్థులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్‌ఎఫ్‌ఐ, ఏబీవీపీ నాయకులు వేర్వేరుగా డీఈఓను కలిసి వంట ఇక్కడే చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. డీఈఓను కలిసిన వారిలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్ ప్రశాంత్, ఏబీవీపీ కన్వీనర్ సౌమ్య ఉన్నారు.
పీయూకు బంగారు పతకం అందించాలి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: విద్యారర్థులు యోగా పోటీల్లో తమ నైపుణ్యాలను పూర్తిస్థాయిలో వినియోగించుకొని పీయూకు బంగారు పతకం అందించాలని వీసీ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్‌బాబు అన్నారు. పీయూలో ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ, సౌత్ జోన్ పోటీలకు క్రీడాకారుల ఎంపిక కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పోటీల్లో ఎంపికై న విద్యార్థులను వీసీ, రిజిస్ట్రార్ అభినందించారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు బెంగళూరులోని సవస్య యూనివర్సిటీలో జరిగే పోటీల్లో పాల్గొనున్నట్లు పీడీ శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా యోగా క్రీడా అసోసియేషన్ అధ్యక్షుడు బాలరజాయ్య, సెక్రటరీ రజిని తదితరులు పాల్గొన్నారు.