
యూరియా తిని 12 మేకలు మృతి
నవాబుపేట: పొలంలో మేతలు మేస్తున్న మేకలు అక్కడున్న యూరియాను తినడంతో అక్కడికక్కడే మృతిచెందాయి. మండలంలోని అమ్మాపూర్‌కు చెందిన మంగళి ప్రభాకర్‌కు చెందిన మేకలను ఎప్పటి మా దిరిగా ఆదివారం మేతకు తీసుకెళ్లాడు. కాగా గ్రామ సమీపంలోని పొలంలో మంగళి మా సయ్య పొలంలో మొక్కజొన్న మేత మేస్తుండగా పక్కనే ఉన్న సొప్పగూళ్లో ఉంచిన కొంత యూరియాను మేకలు తినేశాయి. దీంతో కొద్దిసేపట్లోనే మేకలు కిందపడి మృతిచెందాయి. 20మేకలను తీసుకెళ్తే 12మేకలు మాత్రం యూరియా తిన్నాయి. మిగతా మేకలు వేరేచోట మేత మేస్తున్నాయి. మేకలు ఒక్కొక్కటిగా కిందపడి మృతిచెందడంతో రైతు బోరున విలపించి గ్రామస్తులకు సమాచారం అందించాడు. గ్రామస్తు లు వచ్చేసరికే అక్కడ యూరియా తిన్న 12మేలు మృతిచెందాయి. కాగా మృతిచెందిన మేకల విలువ దాదాపు రూ.2లక్షలకు పైగానే ఉంటుందని రైతు వాపోయాడు. ఈ విషయంలో మేకలతో ఉపాధి పొంది జీవిస్తున్న మంగళి ప్రభాకర్ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.