
ట్రోఫీలు అందజేసిన ఎమ్మెల్యే యెన్నం
రాష్ట్రస్థాయి జూనియర్ నెట్‌బాల్ పోటీల ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన విన్నర్, రన్నరప్, మూడో స్థానం జట్లకు ట్రోఫీలు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడలను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగపరచడమే కాకుండా ఆత్మవిశ్వాసం, నాయకత్వం, పట్టుదల, లక్ష్యాలను సాధించాలనే సంకల్పాన్ని నేర్పుతుందన్నారు. ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్‌పీ వెంకటేశ్ జిల్లా కేంద్రంలో నాలుగు రోజులపాటు రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఓడిన వారు నిరాశ చెందకుండా మళ్లీ గెలుపు కోసం శ్రమించాలని కోరారు. అంతర్జాతీయ నెట్‌బాల్ పోటీల్లో పాల్గొన్న రాష్ట్ర క్రీడాకారిణులను ఎమ్మెల్యే శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, నెట్‌బాల్ అసోసియేషన్ తెలంగాణ అధ్యక్షుడు విక్రమాదిత్యరెడ్డి, కార్యదర్శి శిరీషరాణి, రామ్మోహన్‌గౌడ్, అంజద్‌అలీ, విహారి, షరీఫ్, మాజీ కౌన్సిలర్ షేక్ ఉమర్‌తోపాటు వివిధ జిల్లాల జట్ల కోచ్‌లు, మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.