ప్రేమ విఫలమైందని.. యువకుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ప్రేమ విఫలమైందని.. యువకుడి ఆత్మహత్య

Oct 13 2025 8:47 AM | Updated on Oct 13 2025 8:47 AM

ప్రేమ

ప్రేమ విఫలమైందని.. యువకుడి ఆత్మహత్య

నాగర్‌కర్నూల్‌ క్రైం: ప్రేమ విఫలమై మనస్తాపానికి గురై ఇంట్లో ఉరివేసుకుని యువకుడు మృతిచెందిన ఘటన జిల్లా కేంద్రంలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకోగా ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై గోవర్ధన్‌ కథనం ప్రకారం.. కొల్లాపూర్‌ పట్టణానికి చెందిన కొమ్ము రామకృష్ణ (25) జిల్లాకేంద్రంలోని మంతటి చౌరస్తా వద్ద బైక్‌ మెకానిక్‌ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడు ఏడాది కాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఇంట్లో విషయం తెలియడంతో తల్లిదండ్రులు కొమ్ము రామకృష్ణను మందలించారు. ప్రేమించిన యువతి తనకు దక్కదని మనస్తాపానికి గురై క్షణికావేశంలో రాఘవేంద్రకాలనీలోని తన బాబాయి ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనరల్‌ ఆస్పత్రి మార్చురీకి తరించారు. ఘటనకు సంబంధించి మృతుడి అన్న సలేశ్వరం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

నీటిగుంతలోకి దూకి యువకుడు ఆత్మహత్య

జడ్చర్ల: నీటి గుంతలో దూకి యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం మండలంలోని కొండేడులో చోటుచేసుకుంది. కొండేడు గ్రామ శివారులో గ్రామాభివృద్ధి కోసం భారీగా మట్టిని తీయడంతో అక్కడ ఓ గుంత ఏర్పడింది. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ గుంతలో భారీగా నీరు నిలించింది. గ్రామానికి చెందిన రమేశ్‌(25) అక్కడకు చేరుకుని ఆకస్మికంగా అందులోకి దూకి మునిగిపోయాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం అక్కడకు చేరుకుని నీటి గుంతలో గాలించి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి భార్య కొన్నాళ్ల కిందటే భర్తను విడిచి వెళ్లిందని, మృతుడికి తల్లి చిలకమ్మ, తమ్ముడు సురేశ్‌ ఉన్నారు. మద్యం మత్తులో నీటిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని గ్రామస్తులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కమలాకర్‌ తెలిపారు.

చోరీకి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు

తెలకపల్లి: పంక్షన్‌ హాలులో చోరీకి పాల్పడిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ నరేశ్‌ కథనం ప్రకారం.. మండల కేంద్రంలో ఓ పంక్షన్‌ హాలులో ఈనెల 7న గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. పంక్షన్‌ హాలులో ఉన్న ఐదున్నర క్వింటాళ్ల ఇనుము, జేసీబీకి సంబంధించిన సామగ్రి చోరీకి గురైనట్లు ఎస్‌ఐ తెలిపారు. బాధితుడు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. నిందుతుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. బాధితుడికి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

నాగర్‌కర్నూల్‌ క్రైం: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని గు డిపల్లి శివారులో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఎస్‌ఐ గోవర్ధన్‌ కథనం ప్రకారం.. మండలంలోని శ్రీపురం గ్రామానికి చెందిన మైనగాని రాములు (37) తన భార్య మానస తో కలిసి జిల్లా కేంద్రంలో ఓ అద్దె ఇంట్లో నివా సం ఉంటున్నాడు. ఇతడు ఫ్లంబర్‌ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈనెల 9న త న బంధువుల వివాహం ఉండడంతో గుడపల్లికి వెళ్లారు. శనివారం అర్ధరాత్రి గుడిపల్లి శివా రులో మైనగాని రాములు అనుమానాస్పద స్థితిలో మృతిచెంది ఉండడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ అశోక్‌రెడ్డి, ఎస్‌ఐ గోవర్ధన్‌ ఘటనా స్థలా న్ని పరిశీలించి మృతదేహాన్ని జనరల్‌ ఆస్పత్రికి తలించారు. మృతుడు మైనగాని రాములు భార్య మానసకు పెద్దముద్దునూరుకు చెందిన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని, ఇరువురు కలిసి హత్య చేసి ఉంటారని, మృతిపై అనుమానం ఉందని పోలీసులకు మృతుడి తండ్రి మైనగాని పాండయ్య ఫిర్యాదు చేయడంతో అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

బాలింత మృతిపై

కేసు నమోదు

నాగర్‌కర్నూల్‌ క్రైం: బాలింత మృతిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ గోవర్ధన్‌ ఆదివారం తెలిపారు. ఎస్‌ఐ కథనం ప్రకారం.. బిజినేపల్లి మండలం లట్టుపల్లికి చెందిన రాత్లావత్‌ కవిత (26) ఈనెల 10న కాన్పు కోసం జిల్లా కేంద్రంలోని జనరల్‌ ఆస్పత్రిలో చేరింది. కాన్పు అనంతరం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని నిలోఫర్‌ ఆస్పత్రికి రెఫర్‌ చేశారు. అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి రెఫర్‌ చేయడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం మృతిచెందింది. ఘటనకు సంబంధించి మృతురాలి తల్లి రాత్లావత్‌ తులసి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ప్రేమ విఫలమైందని.. యువకుడి ఆత్మహత్య 
1
1/2

ప్రేమ విఫలమైందని.. యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమైందని.. యువకుడి ఆత్మహత్య 
2
2/2

ప్రేమ విఫలమైందని.. యువకుడి ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement