
పరిహారం ఇస్తారా.. చావమంటరా?
కృష్ణా: సత్యసాయి పంప్‌హౌజ్ ఎదుట శుక్రవారం ఓ నిరుపేద కుటుంబ సభ్యులు పురుగుమందు డబ్బాతో నిరసన వ్యక్తం చేసిన ఘటన చోటుచేసుకుంది. తమకు పరిహారం ఇస్తారా? చావమంటరా? అంటూ హెచ్చరించారు. బాధితుల కథనం ప్రకారం.. గుడేబల్లూర్‌కు చెందిన బుడ్డమోళ్ల మహేశ్ కుటుంబానికి చెందిన 7గుంటల భూమిని 25ఏళ్ల కిందట సత్యసాయి తాగునీటి పంపుహౌజ్ నిర్మాణానికి ఇచ్చారు. అప్పట్లో సంస్థలో ఒరికి ఉ ద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారని.. తీరా ఉద్యో గం కల్పించలేదు, ఎలాంటి పరిహారం ఇవ్వలేదని ఆరోపించారు. మా నాన్న కార్యలయాలకు తిరిగితిరిగి మృతిచెందాడని, ఇప్పుడు కూడా పలుమార్లు సత్యసాయి కార్యాలయాలు, అధికారులకు ఫిర్యా దు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రస్తు తం భారత్‌మాల రోడ్డు నిర్మాణం ఈ భూమి నుంచి (సత్యసాయి నీటిపంపు) వెళ్తుంది. ఆ పరిహారం డబ్బులు బాధిత కుటుంబానికి రావడంలేదు. దీంతో ఆ పరిహారం డబ్బులు మా కుటుంబానికి అందించాలని, ఈ విషయంపై పలుమార్లు మండల, జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆదేవన వ్యక్తం చేశారు. దీంతో సహ నం నశించి పంపుహౌజ్ ఎదుట పురుగుల మందుతో బైఠాయించారు. పరిహారం అందిస్తారా లేక ఆత్మహత్య చేసుకోవాల అంటూ హెచ్చరించారు. విషయం తెలుసుకున్న సత్యసాయి నీటిసరఫరా అధికారులు, ఎస్‌ఐ ఎండీ నవీద్ అక్కడికి చేరుకొని తగిన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో దీక్షను విరమించారు. వారం రోజుల్లో తమకు న్యాయం జరగకపోతే మళ్లీ బైఠాయిస్తామని పేర్కొన్నారు.
సత్యసాయి పంప్‌హౌజ్ ఎదుట
బాధితుల నిరసన
భారత్‌మాల పరిహారం మాకే
ఇవ్వాలంటూ డిమాండ్