
‘పొడి’.. తడబడి!
● రాంమందిర్ చౌరస్తా నుంచి వీరన్నపేట రైల్వే ట్రాక్ వరకువెళ్లే దారిలో మూడు, నాలుగు చోట్ల రోడ్డు పక్కన చెత్తాచెదారంపడేస్తున్నారు.
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: నగర పరిధిలో ఏటా స్వచ్ఛత.. పరిశుభ్రత కోసం ఎన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నా ఎలాంటి ప్రయోజనం దక్కడం లేదు. దీంతో ఎక్కడబడితే అక్కడ చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా రహదారుల పక్కన వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. అసలే వర్షాకాలం.. ఆపై అపరిశుభ్రత కారణంగా సీజనల్ వ్యాధులు (డెంగీ, మలేరియా, విషజ్వరాలు) ప్రబలుతున్నాయి. వివిధ డివిజన్లలో ‘సాక్షి’ పరిశీలించగా ఈ విషయం వెలుగు చూసింది.
ఎన్ని కార్యక్రమాలు చేపడుతున్నా..
మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్లు ఉన్నాయి. సుమారు మూడు లక్షల జనాభాకు క్షేత్రస్థాయిలో 388 మంది పారిశుద్ధ్య కార్మికులు మాత్రమే పనిచేస్తున్నారు. చెత్తను సేకరించడానికి 75 స్వచ్ఛ ఆటోలు, 12 ట్రాక్టర్లను వినియోగిస్తున్నారు. ఇవేగాక మరో 12 ప్రైవేట్ ట్రాక్టర్లు తిరుగుతున్నా ప్రయోజనం దక్కడం లేదు. నిత్యం 107 మెట్రిక్ టన్నుల చెత్తను కోయిల్‌కొండ ఎక్స్ రోడ్‌కు తరలిస్తున్నామని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ఇక ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఏడాది పొడవునా ‘స్వచ్ఛతా హీ సేవ’ చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఇంటింటికీ వచ్చే స్వచ్ఛ ఆటోలకు తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని నగర ప్రజలకు మున్సిపల్ సిబ్బంది అవగాహన కల్పిస్తున్నా స్పందన అంతంత మాత్రమే వస్తోంది. ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటిస్తున్నారు. అలాగే జూన్ నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు ‘వంద రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక’ కొనసాగినా ఎలాంటి ఉపయోగం లేదు. అడపాదడపా నీటి వనరుల వద్ద, జన సమర్ధ ప్రదేశాలలో చెత్తచెదారం నామమాత్రంగా తొలగించి చేతులు దులుపుకొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల్లో రాష్ట్ర స్థాయిలో మహబూబ్‌నగర్ గతేడాది నాలుగో స్థానంలో ఉండగా.. ఈసారి పదికి పడిపోవడం గమనార్హం. దీనిని బట్టే చూస్తే ఇక్కడి అధికారులు, సిబ్బంది పనితీరు ఎలా ఉందో ఇట్టే అర్థమవుతుంది.
ఎక్కడెక్కడ అంటే..?
‘స్వచ్ఛత’పై నామమాత్రంగానే ప్రత్యేక కార్యక్రమాలు
ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా స్పందన కరువు
నగరంలో ఎక్కడబడితే అక్కడ చెత్తకుప్పలే దర్శనం..
రహదారుల పక్కన
పేరుకుపోతున్న వ్యర్థాలు
అసలే వర్షాకాలం.. ప్రబలుతున్న
సీజనల్ వ్యాధులు

‘పొడి’.. తడబడి!