
అంతా అపరిశుభ్ర వాతావరణమే
టీడీగుట్ట సమీపంలోని కూరగాయల మార్కెట్ మొత్తం అపరిశుభ్రంగా తయారైంది. ఎక్కడబడితే అక్కడ కుళ్లిపోయిన కూరగాయలు, ఆకుకూరలు అలాగే పడేస్తున్నారు. నిత్యావసర వస్తువులతో పాటు పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు కొనడానికి అక్కడికి వెళ్లాలంటేనే జుర్రుమంటోంది. ఎప్పటికప్పుడు మున్సిపల్ సిబ్బంది ఈ వ్యర్థాలను తొలగిస్తే బాగుంటుంది. – రవికుమార్,
లక్ష్మీనగర్‌కాలనీ, మహబూబ్‌నగర్
అన్ని చర్యలు తీసుకుంటున్నాం
నగరంలో పరిశుభ్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అందుకోసం వివిధ కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నాం. ఓపెన్ ప్లాట్ల లో చెత్త వేయొద్దని లేదంటే జరిమానా విధిస్తామని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశాం. దీనిపై మా సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా వారి నుంచి సరైన స్పందన రావడం లేదు. నగరాన్ని స్వచ్ఛతగా ఉంచటానికి అందరూ సహకరించాలి.
– టి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, కమిషనర్, మున్సిపల్ కార్పొరేషన్, మహబూబ్‌నగర్
●

అంతా అపరిశుభ్ర వాతావరణమే