
ఉత్సాహంగా ఎస్‌జీఎఫ్ కబడ్డీ జట్టు ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియంలో బుధవారం ఉమ్మడి జిల్లా అండర్–19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ బాల, బాలికల కబడ్డీ సెలక్షన్స్ నిర్వహించారు. డీఐఈఓ కౌసర్ జహాన్ క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. రాష్ట్రస్థాయి అండర్–19 కబడ్డీ పోటీల్లో మెరుగైన ప్రతిభ కనబరిచి విజేతగా నిలవాలని ఆకాంక్షించారు. జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ శారదాబాయి మాట్లాడుతూ.. ఎంపికల్లో 80మంది బాల, బాలికలు పాల్గొన్నట్లు తెలిపారు. వీరిలో 12మంది బాలుర, 12మంది బాలికలను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. సంగారెడ్డిలో ఈనెల 10నుంచి 12వరకు రాష్ట్రస్థాయి అండర్–19 ఎస్‌జీఎఫ్ టోర్నీ నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్, వ్యాయామ విద్య ఉపాధ్యాయులు బాల్‌రాజు, జగన్‌మోహన్‌గౌడ్, వేణుగోపాల్, మేరీపుష్ప, శ్రీనివాసులు, రమేశ్, మోహన్, భారతి తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లా అండర్–19 బాలుర జట్టు
వి.చందు (కెప్టెన్), బి.ఆంజనేయులు, బి.హర్షవర్ధన్, ఎన్.శ్రీకాంత్, ఎస్.దత్తాత్రేయ, ఎం.రాంచరణ్, జె.అనిల్‌కుమార్, హన్ముంతు, వి.గౌతం, విక్రమ్ నాయక్, ఎస్‌కె.రాజు, సి.భాస్కర్.
● బాలికల జట్టు: జె.గంగ (కెప్టెన్), కె.భవాని, ఎం.నందిని, పి.సింధూజ, పి.శివానీ, బి.జ్యోత్స్న, ఎస్.సింధు, నాగప్రత్యూష, పి.ఇందేశ్వరి, గాయత్రి, గౌరి, మౌనిక.