
నేటి నుంచి నెట్‌బాల్ సమరం
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా కేంద్రం మరో రాష్ట్రస్థాయి క్రీడాపోటీలకు వేదికకానుంది. స్థానిక మెయిన్ స్టేడియంలో గురువారం నుంచి ఈనెల 12వ తేదీ వరకు రాష్ట్రస్థాయి నెట్‌బాల్ చాంపియన్‌షిప్ నిర్వహించనున్నారు. మూడు విభాగాల్లో జూనియర్ విభాగం పోటీలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 8వ ట్రెడిషనల్, 3వ ఫాస్ట్–5, మొదటి మిక్స్‌డ్ బాల, బాలికల పోటీలు జరగనున్నాయి. 9, 10 తేదీల్లో ట్రెడిషనల్ విభాగం, 10, 11 తేదీల్లో ఫాస్ట్–5, 11, 12 తేదీల్లో మిక్స్‌డ్ విభాగం పోటీలు నిర్వహించనున్నారు.
1200 మంది క్రీడాకారుల రాక
ఈ మూడు విభాగాలకు సంబంధించి రాష్ట వ్యాప్తంగా 1200 మంది బాల, బాలికలు హాజరుకానున్నారు. 130 మంది కోచ్‌లు, మేనేజర్లు, 80 మంది టెక్నికల్ అషీషియల్స్ రానున్నారు. మహబూబ్‌నగర్, నారాయణపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్, మంచిర్యాల, గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మేడ్చల్, జగిత్యాల, మహబూబాబాద్, రంగారెడ్డి, నల్గొండ, వరంగల్, జనగాం, సిరిసిల్ల, వికారాబాద్, పెద్దపల్లి, సూర్యాపేట, సంగారెడ్డి పాల్గొంటున్నాయి. లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో ఉదయంతోపాటు సాయంత్రం వేళల్లో ఫ్లడ్‌లైట్ల వెలుతురులో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈనెల 10వ తేదీన సాయంత్రం 4 గంటలకు టోర్నమెంట్‌ను ప్రారంభించనున్నారు.
క్రీడాకారుల వసతి
టోర్నీలో పాల్గొనే క్రీడాకారులకు అంబేడ్కర్ భవన్, స్కౌట్స్ గైడ్స్ భవనం, చైతన్య స్కూల్, లిటిల్ స్కా లర్స్ స్కూల్, మహబూబ్‌నగర్ హై స్కూల్, మా డ్రన్ పాఠశాలలో వసతి, మెయిన్ స్టేడియంలో భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. టోర్నమెంట్ నిర్వహ ణకు మెయిన్ స్టేడియంలో ఏర్పాటు చేస్తున్నారు.
మరో రాష్ట్రస్థాయి క్రీడలకు పాలమూరు ఆతిథ్యం
మెయిన్ స్టేడియంలో నిర్వహణ
మూడు విభాగాల్లో టోర్నీ
హాజరుకానున్న 1200మంది క్రీడాకారులు

నేటి నుంచి నెట్‌బాల్ సమరం

నేటి నుంచి నెట్‌బాల్ సమరం