
నిర్మాణం పనులు ఇలా..
స్టేట్ హోమ్ ప్రాంగణంలో కొత్తగా నిర్మిస్తున్న నూతన బాల సదనం పనుల్లో డొల్లతనం కనిపిస్తుంది. అధికారులు పట్టించుకోకపోవడం వల్ల సంబంధిత కాంట్రాక్టర్ రాత్రి పగలు అనక గడువులోగా అంటే ఆరునెలల కాలంలోనే భవన నిర్మాణం పూర్తి చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నాణ్యత లేని సిమెంట్ ఇటుకలు, ప్రతిష్టవంతం లేని ఫిల్టర్ ఇసుక, డస్ట్ (రాతి పొడి) మోతాదుకు మించి వాడటం వల్ల పనులు త్వరలో ముగిశాయని పలువురు అంటున్నారు. అసలే అనాధ పిల్లలు వారి బంగారు భవిష్యత్తు కోసం భవన నిర్మాణం పనుల్లో నాణ్యతగా చేయాల్సి ఉండగా అధికారుల నిర్లక్ష్యానికి కాంట్రాక్టర్ చేతివాటం తోడవడంతో భవన నిర్మాణంపై అనుమానాలకు దారి తీస్తుంది. కాంట్రాక్టర్ ఇష్టమొచ్చిన రీతిలో గడువుకు ముందే భవనం రెడీ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.